Begin typing your search above and press return to search.

ఉగాది కి మ‌హేష్-రాజ‌మౌళి స‌ర్ ప్రైజ్ ప్లాన్ చేసారా?

తాజాగా ఏప్రిల్ 9 ఉగాది సంద‌ర్భంగా ప్రాజెక్ట్ ని అధికారికంగా ప్ర‌క‌టించి...అందులో న‌టీన‌టులు ఇత‌ర వివ‌రాలు అన్నింటిని వెల్ల‌డించాల‌ని చిత్ర వ‌ర్గాలు భావిస్తున్నాయ‌ట‌.

By:  Tupaki Desk   |   3 April 2024 8:16 AM GMT
ఉగాది కి మ‌హేష్-రాజ‌మౌళి స‌ర్ ప్రైజ్ ప్లాన్ చేసారా?
X

సూప‌ర్ స్టార్ మ‌హేష్‌-రాజ‌మౌళి పాన్ ఇండియా ప్రాజెక్ట్ కి సంబంధించి ఎలాంటి అధికారిక స‌మాచారం లేని సంగ‌తి తెలిసిందే. ఇద్ద‌రు సినిమా చేస్తున్నారన్న‌ది ఎంత వాస్త‌వ‌మో! మీడియాకి అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు అన్న‌ది అంతే వాస్త‌వం. మ‌రి ఇప్పుడా ప్రాజెక్ట్ ని అధికారికం చేసే స‌మ‌యం ఆస‌న్న‌మైందా? అందుకు మంచి ముహూర్తం పెట్టేసారా? అంటే అవున‌నే తెలుస్తోంది. ప్ర‌స్తుతం మ‌హేష్‌-రాజ‌మౌళి ఆ సినిమా ప‌నుల్లోనే బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే.

మ‌హేష్ అవ‌స‌రం మేర జ‌ర్మ‌నీలో రెండు వారాల పాటు ప్ర‌త్యేక శిక్ష‌ణ తీసుకుని తిరిగొచ్చాడు. 'గుంటూరు కారం' రిలీజ్ కాగానే మ‌హేష్ చేసిన మొట్ట మొద‌టి ప‌ని అదే. ఇటు రాజ‌మౌళి న‌టీన‌టుల ఎంపిక ప‌నుల్లో బిజీగా ఉన్నారు. స్క్రిప్ట్ లాక్ అయిన నేప‌థ్యంలో ఏపాత్రకి ఎవ‌రెవ‌ర్నీ తీసుకోవాలి అన్న అంశంపైనే కొన్ని నెల‌లుగా వ‌ర్క్ చేస్తున్నారు. అలాగే ఎంపిక చేసిన కీల‌క నటీనటులంద‌రికీ ప్ర‌త్యేకంగా వ‌ర్క్ షాప్ లు నిర్వ‌హించాల‌ని ప్లాన్ చేస్తున్నారు.

మ‌రోవైపు ఆర్ట్ వ‌ర్క్ వేగంగా జ‌రుగుతుంది. అవ‌స‌రం మేర ఒరిజిన‌ల్ లొకేష‌న్స్ కి వెళ్తున్నా సెట్స్ లో చేయాల్సిన షూట్ చాలానే ఉంది. అలాగే మ‌హేష్ లుక్ డిజైన్ కూడా వేగంగా జ‌రుగుతుంది. అయితే ఈ సంగ‌తులేవి అధికారికంగా తెలియ‌దు. తాజాగా ఏప్రిల్ 9 ఉగాది సంద‌ర్భంగా ప్రాజెక్ట్ ని అధికారికంగా ప్ర‌క‌టించి...అందులో న‌టీన‌టులు ఇత‌ర వివ‌రాలు అన్నింటిని వెల్ల‌డించాల‌ని చిత్ర వ‌ర్గాలు భావిస్తున్నాయ‌ట‌.

కుదిరితే మ‌హేష్ ప్రీ లుక్ కూడా రిలీజ్ చేయాల‌న్న‌ది ప్లాన్ గా లీకైంది. అదే జ‌రిగితే అభిమానుల‌కు పెద్ద పండ‌గే. ఇది ఊహించ‌ని స‌ర్ ప్రైజ్ అవుతుంది. అయితే అదంత వీజీ కాదు. అలా జ‌రిగితే అది జ‌క్క‌న్న రూల్ కి విరుద్దం. ఎందుకంటే ఆయ‌న ఏ పాన్ ఇండియా సినిమా చేసినా అంతా సైలెంట్ గా ఉంటుంది. ఎక్క‌డా ఏ లీక్ లు ఉండ‌వు. సినిమా షూటింగ్ పూర్త‌య్యే వ‌ర‌కూ ఎలాంటి అప్ డేట్ కూడా ఉండ‌దు. సినిమాకి సంబంధించిన విష‌యాలు అంత గోప్యంగా ఉంచుతారు. మ‌రి మ‌హేష్ విష‌యంలో ఉగాది సంద‌ర్భంగా త‌న నిబంధ‌నేమైనా దాటుతారా? అన్న‌ది చూడాలి.