Begin typing your search above and press return to search.

కృష్ణుడిగా మహేష్.. భీముడిగా తారక్.. అర్జునుడిగా చరణ్..!

ఈ క్రమంలో రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా మహాభారతం చేస్తానని ప్రకటించగా.. బాలీవుడ్ మేకర్స్ కూడా మహా భారతాన్ని సినిమాగా చేయాలని ప్రయత్నిస్తున్నారు.

By:  Tupaki Desk   |   5 Jan 2024 12:30 PM GMT
కృష్ణుడిగా మహేష్.. భీముడిగా తారక్.. అర్జునుడిగా చరణ్..!
X

తెలుగు దర్శక నిర్మాతలు ఈమధ్య పురాణాలను కూడా తెర మీదకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ ఒకప్పుడు పౌరాణిక సినిమాలతో అలరించిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈ తరం దర్శకులు కూడా ఇతిహాస కథలను మళ్లీ తెర మీదకు తీసుకు రావాలని చూస్తున్నారు. ఈ క్రమంలో రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా మహాభారతం చేస్తానని ప్రకటించగా.. బాలీవుడ్ మేకర్స్ కూడా మహా భారతాన్ని సినిమాగా చేయాలని ప్రయత్నిస్తున్నారు.

బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి మహా భారతాన్ని పర్వ అనే టైటిల్ తో సినిమాగా చేయాలని చూస్తున్నారు. వీరితో పాటుగా టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా మహా భారతాన్ని తెరకెక్కించాలని చూస్తున్నాడు. హనుమాన్ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న ప్రశాంత్ వర్మ మహా భారతాన్ని సినిమాగా చేయాలని ఉందని తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

ఈ క్రమంలో ఇప్పటి స్టార్స్ లో ఎవరెవరు ఏయే పాత్రలకు పర్ఫెక్ట్ గా అనుకుంటున్నారో ప్రశాంత్ వర్మ చెప్పారు. అందులో ధర్మ రాజుగా చిరంజీవి, అర్జునుడిగా రాం చరణ్, భీముడిగా ఎన్.టి.ఆర్ పేరు చెప్పారు. కృష్ణుడిగా మహేష్, నకులుడుగా నాని, దుర్యోధనుడుగా మోహన్ బాబు, కర్ణుడుగా పవన్ కళ్యాణ్, ద్రౌపదిగా నయనతార పర్ఫెక్ట్ అని చెప్పారు. ఒకరిద్దరు పాత్రలు తప్పా ప్రశాంత్ వర్మ చెప్పినవన్ని మన స్టార్స్ ఇమేజ్ కి సూటయ్యేవనే చెప్పొచ్చు.

రాజమౌళి తీసే మహా భారతం లో ఎవరెవరు ఏయే పాత్రల్లో నటిస్తారన్నది చెప్పడం కష్టం. కానీ ప్రశాంత్ వర్మ మహా భారతం తీస్తే మాత్రం తెలుగు స్టార్స్ అంతా కూడా దానిలో భాగం అవుతారని చెప్పొచ్చు. అ! సినిమా నుంచి తన ప్రతి సినిమాతో ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్న ఎవరు తీసినా సరే తెలుగు హీరోలతో మహా భారతం అంటే పాన్ ఇండియా రేంజ్ లో రికార్డులు సాధించడం పక్కా అని చెప్పొచ్చు. ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాతో మరో క్రేజీ అటెంప్ట్ చేస్తున్నారు. తప్పకుండా ఈ సినిమా ప్రశాంత్ స్టామినా ఏంటో చూపిస్తుందని అంటున్నారు.