సీఎం ని కలిసి చెక్ అందించిన సూపర్ స్టార్ ఫ్యామిలీ!
అలాగే సూపర్ స్టార్ మహేష్ కూడా తెలంగాణ ప్రభుత్వ సహాయ నిధికి 60 లక్షలు విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 23 Sep 2024 8:46 AM GMTఅకాల వరదలతో తెలుగు రాష్ట్రాలు నీట మునిగిన నేపథ్యంలో విరాళాలు ప్రకటించిన వారంతా నేరుగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కలిసి చెక్ లు అందిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే స్టార్ హీరోలంతా నేరుగా సీఎంలను కలిసి చెక్ లు అందించారు. అలాగే సూపర్ స్టార్ మహేష్ కూడా తెలంగాణ ప్రభుత్వ సహాయ నిధికి 60 లక్షలు విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే.
అయితే తాజాగా ఆయన సతీమణి నమ్రతా శిరోద్కర్ తో కలిసి మహేష్ హైదరాబాద్ లోని సీఎంత రెడ్డి ఇంటికెళ్లి చెక్ ను అందించారు. మహేష్ ఫ్యామిలీ నుంచి 50 లక్షలు, ఏఎంబీ తరపున మరో 10 లక్షలు అందించారు. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక మహేష్ లుక్ గురించైతే చెప్పాల్సిన పనిలేదు. లుక్ తో అభిమానుల మతి పొగొట్టాడు. హాలీవుడ్ స్టార్ నే మించిపోయాడు.
లాంగ్ హెయిర్ స్టైల్ అదిరిపోయింది. గడ్డం..మీసాలు కూడా భారీగానే పెంచాడు. ఇంతవరకూ ఇలాంటి లుక్ ట్రై చేయలేదు. తొలిసారి రాజమౌళి సినిమా కోసం ఓ కొత్త లుక్ ట్రై చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం వరకూ లాంగ్ హెయిర్ స్టైల్ లో కాస్త కర్లీ హెయిర్ కనిపించేది. కానీ ఇప్పుడా హెయిర్ స్టైల్ కి జెల్ పూసి నునుపుగా తయారు చేసారు. మహేష్ న్యు లుక్ చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు.
ఇక సూపర్ స్టార్ కొత్త చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న సంగతి తెలిసిందే. కొంత కాలంగా రాజమౌళి ఆ పనుల్లోనే బిజీగా ఉన్నారు. సినిమాకి సంబంధించి వర్క్ షాపులు కూడా నిర్వహిస్తున్నారు. వాటికి మహేష్ హాజరవుతున్నారు.