మరోసారి మంచి మనసు చాటుకున్న మహేష్
గత కొంతకాలంగా సూపర్ స్టార్ మహేష్ బాబు(mahesh babu) చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్లు చేయిస్తున్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 17 March 2025 11:29 PM ISTగత కొంతకాలంగా సూపర్ స్టార్ మహేష్ బాబు(mahesh babu) చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్లు చేయిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి మహేష్ బాబు, అతని భార్య నమ్రతా శిరోద్కర్(namratha Sirodkar) పసి పిల్లల కోసం మదర్స్ మిల్స్ బ్యాంకును ప్రారంభించారు. ఆంధ్రా హాస్పిటల్స్(Andhra Hospitals) తో కలిసి ఎంబీ ఫౌండేషన్(MB Foundation) ఈ ప్రాజెక్టును ప్రారంభించింది.
తల్లి పాలు అందని వారికి, తక్కువ బరువుతో పుట్టిన పిల్లలకు దీని ద్వారా పాలు అందిస్తామని నమ్రత తెలిపారు. పాలు ఎక్కువగా ఉన్న తల్లుల నుంచి పాలను సేకరించి, వాటిని అవసరమైన వారికి అందచేయనున్నామని, తల్లి పాల వల్ల పిల్లలకు ఇమ్యూనిటీ పవర్ పెరగడంతో పాటూ ఎలాంటి ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయని నమ్రత చెప్పారు.
దీంతో పటూ సర్వికల్ క్యాన్సర్ కు వ్యాక్సిన్ కార్యక్రమాన్ని కూడా ఎంబీ ఫౌండేషన్ స్టార్ట్ చేస్తున్నట్టు నమత్ర వెల్లడించారు. ఈ రోజుల్లో గర్భాశయ క్యాన్సర్ సమస్య చాలా మందికి తీవ్ర సమస్యగా మారిందని, ముందే దానికి వ్యాక్సిన్ తీసుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని, 9 నుంచి 18 ఏళ్ల బాలికలకు దీన్ని అందించాలనుకుంటున్నామని, 2025 చివరి నాటికి 1500 మంది బాలికలకు టీకాలు వేయడమే తమ లక్ష్యమని నమ్రత తెలిపారు. మహేష్ చేస్తున్న ఈ మంచి పనికి ఆయన్ను అందరూ అభినందిస్తున్నారు.