Begin typing your search above and press return to search.

మేనల్లుడి మూవీలో మహేష్.. బిగ్ సర్ ప్రైజ్

సూపర్‌స్టార్‌ కృష్ణ మనవడిగా, మహేష్ బాబు మేనల్లుడిగా తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు యంగ్ హీరో అశోక్ గల్లా.

By:  Tupaki Desk   |   28 Oct 2024 11:30 AM GMT
మేనల్లుడి మూవీలో మహేష్.. బిగ్ సర్ ప్రైజ్
X

సూపర్‌స్టార్‌ కృష్ణ మనవడిగా, మహేష్ బాబు మేనల్లుడిగా తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు యంగ్ హీరో అశోక్ గల్లా. ఫస్ట్ మూవీ హీరోతో కథానాయకుడిగా మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం దేవకీ నందన వాసుదేవ సినిమా చేస్తున్నారు. గుణ 369 ఫేమ్ అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్నారు. డివైన్‌ ఎలిమెంట్స్‌ తో కూడిన యాక్షన్‌ ప్యాక్డ్‌ ఫ్యామిలీ ఎంటైర్టెనర్‌ గా తెరకెక్కిస్తున్నారు.

దేవకీ నందన వాసుదేవలో అశోక్ గల్లా సరసన కొత్త హీరోయిన్ మన తెలుగు అమ్మాయి మానస వారణాసి నటిస్తున్నారు. ఈ సినిమాతోనే ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారు. లలితాంబికా ప్రొడక్షన్స్ బ్యానర్‌ పై సోమినేని బాలకృష్ణ (ఎన్ఆర్ఐ) నిర్మిస్తున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కథ అందించారు. ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకున్న దేవకీ నందన వాసుదేవ.. నవంబర్ 14వ తేదీ రిలీజ్ కానుంది.

అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. దేవకీ నందన వాసుదేవలో మహేష్ బాబు క్యామియో రోల్ లో కనిపించనున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఆధ్యాత్మిక అంశాలతో తీసిన ఆ సినిమాలో కృష్ణుడిగా మహేష్ కనిపించనున్నారని ఇప్పుడు టాక్ వినిపిస్తోంది. అందుకు సంబంధించిన పోస్టర్ ను మేకర్స్.. దీపావళి పండుగ కానుకగా విడుదల చేయనున్నారని వార్తలు వస్తున్నాయి.

ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. మహేష్ ఫ్యాన్స్ తెగ స్పందిస్తున్నారు. కృష్ణుడి గెటప్ లో మహేష్ అదిరిపోతారని చెబుతున్నారు. ఏఐ ద్వారా క్రియేట్ చేసిన ఇమేజెస్ నెట్టింట పోస్ట్ చేస్తున్నారు. కృష్ణుడి గెటప్ లో సూపర్ స్టార్ ఇలానే ఉంటారేమోనని పోస్టులు పెడుతున్నారు. వెయిటింగ్ ఫర్ అప్డేట్ అంటూ సందడి చేస్తున్నారు. పెద్ద సర్ప్రైజేనని అంటున్నారు. మరి నెట్టింట వైరల్ అవుతున్న వార్త.. నిజమో కాదో తెలియదు.

అయితే సాధారణంగా.. మహేష్ తన ఫ్యామిలీ మెంబర్స్ కు సంబంధించిన సినిమాలను ప్రమోట్ చేస్తుంటారు. ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కు హాజరవుతుంటారు. సోషల్ మీడియాలో మూవీ అప్డేట్స్ ను రిలీజ్ చేస్తుంటారు. ఇలా పలు విధాలుగా సపోర్ట్ చేస్తుంటారు. ఇప్పుడు తన మేనల్లుడి చిత్రం దేవకీ నందన వాసుదేవలో నటిస్తే.. ఆయన కెరీర్ లో ఇదే ఫస్ట్ టైమ్ అవుతుంది. అది మూవీ టీమ్ కు కూడా పెద్ద బూస్టప్ గా మారుతుంది. మరి చూడాలి ఏం జరుగుతుందో..