Begin typing your search above and press return to search.

ఛ‌త్ర‌ప‌తిగా మ‌హేష్ అయితే అది సంచ‌ల‌న‌మే!

సూప‌ర్ స్టార్ కృష్ణ బ‌యోపిక్ చేసే అర్హ‌త కేవ‌లం ఆయ‌న త‌న‌యుడు మ‌హేష్ కి మాత్రమే ఉంది. కానీ ఆ ఛాన్స్ తీసుకోవ‌డానికి మ‌హేష్ ఎంత మాత్రం సిద్దంగా లేరు.

By:  Tupaki Desk   |   19 Feb 2025 6:30 PM GMT
ఛ‌త్ర‌ప‌తిగా మ‌హేష్ అయితే అది సంచ‌ల‌న‌మే!
X

సూప‌ర్ స్టార్ కృష్ణ బ‌యోపిక్ చేసే అర్హ‌త కేవ‌లం ఆయ‌న త‌న‌యుడు మ‌హేష్ కి మాత్రమే ఉంది. కానీ ఆ ఛాన్స్ తీసుకోవ‌డానికి మ‌హేష్ ఎంత మాత్రం సిద్దంగా లేరు. నాన్న జీవిత చ‌రిత్ర‌లో తాను న‌టించ‌డం అన్న‌ది జ‌ర‌గ‌ని ప‌నిగానే చాలా సంద‌ర్భాల్లో చెప్పుకొచ్చారు. నా అభిమానుల‌కు నేను దేవుడినైతే?..నా దేవుడు నాన్న అంటూ ఎన్నో సంద‌ర్భాల్లో మ‌న‌సులో భావాన్ని వ్య‌క్త ప‌రిచారు మ‌హేష్‌.

మ‌రి తండ్రి బ‌యోపిక్ లో మ‌హేష్ న‌టిస్తాడా? లేదా? అన్న‌ది త‌ర్వాత సంగ‌తి. అది కాలం డిసైడ్ చేస్తుం ది. కానీ తండ్రి క‌ల‌ను మాత్రం నెర‌వేర్చాల‌ని బాధ్య‌త మాత్రం త‌న‌యుడిపై ఉంద‌న్న‌ది వాస్త‌వం. ఛ‌త్రప‌తి శివాజీ క‌థ‌లో న‌టించాల‌న్న‌ది సూప‌ర్ స్టార్ డ్రీమ్. ఈ విష‌యాన్ని చాలా సంద‌ర్భాల్లో చెప్పారు. అప్ప‌ట్లో `సింహాస‌నం` హిట్ అయిన త‌ర్వాత ఛ‌త్ర‌ప‌తి సినిమా తీయాల‌నుకున్నారు. కానీ ఎందుక‌నో అప్ప‌ట్లో సాధ్య ప‌డ‌లేదు.

ఆ త‌ర్వాత ఎన్నో సినిమాలు చేసారు గానీ....శివాజీ క‌థకు మాత్రం పూనుకోలేక‌పోయారు. చివ‌రికి నెంబర్ వన్, చంద్రహాస్ లాంటి సినిమాల్లో శివాజీ గెట‌ప్ వేసి కాస్త సంతృప్తి ప‌డ్డారు కృష్ణ‌. అటుపై కృష్ణ వ‌య‌సు మీద ప‌డ‌టంతో సినిమాల నుంచి రిటైర్ అయ్యారు. కానీ సూప‌ర్ స్టార్ డ్రీమ్ మాత్రం ఇప్ప‌టికీ అలాగే ఉండి పోయింది. మ‌రి అది ఆయ‌నకు క‌లగానే మిగిలిపోతుందా? త‌న‌యుడి రూపంలో తీరుతుందా? అన్న‌ది మ‌హేష్ చేతుల్లోనే ఉంది.

ఛ‌త్ర‌పతి శివాజీ క‌థ చేయ‌డానికి అన్ని అర్హ‌త‌లు మ‌హేష్ కి ఉన్నాయి. ఆయన చేస్తాను? అని ఎస్ అని చెప్పాలి గానీ.... స్టోరీ రాయ‌డానికి గ్రేట్ రైట‌ర్ విజయేంద్ర ప్ర‌సాద్ రంగ‌లోకి దిగిపోతారు. ఆయ‌న కాదంటే? కృష్ణ ఆస్థాన రైట‌ర్లు ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ సిద్దంగా ఉన్నారు. ఇటీవ‌ల రిలీజ్ అయిన బాలీవుడ్ చిత్రం `ఛావా` రిలీజ్ అవ్వ‌డంతోనే ఈ అంశం టాలీవుడ్ మీడియాలో చ‌ర్చ‌కు దారి తీస్తుంది.