మహేష్… పెద్దోళ్ళతోనే పోటీకి దిగాడు
అలాగే హైదరాబాద్ లోనే ఆర్టీసీ క్రాస్ రోడ్ లో సుదర్శన్ థియేటర్ విక్టరీ వెంకటేష్ తో కలిసి AMB విక్టరీగా మార్చబోతున్నారు.
By: Tupaki Desk | 25 April 2024 6:09 AM GMTసూపర్ స్టార్ మహేష్ బాబు ఓ వైపు నటుడిగా సినిమాలు చేస్తూనే మరోవైపు తన వ్యాపారాలను విస్తరిస్తూ ఉన్నారు. ఇప్పటికే మల్టీప్లెక్స్ థియేటర్స్ బిజినెస్ లోకి అడుగు పెట్టారు. గచ్చిబౌలిలో AMB సినిమాస్ పేరుతో ప్రీమియం మల్టీప్లెక్స్ సినిమా థియేటర్ నడుపుతున్నారు. దీనికి అద్భుతమైన ఆదరణ లభిస్తుంది. అలాగే హైదరాబాద్ లోనే ఆర్టీసీ క్రాస్ రోడ్ లో సుదర్శన్ థియేటర్ విక్టరీ వెంకటేష్ తో కలిసి AMB విక్టరీగా మార్చబోతున్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు తన మల్టీప్లెక్స్ వెంచర్ ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించే పనిలో పడినట్లు తెలుస్తోంది. ఏషియన్ వారితో కలిసి AMB ప్రీమియం మల్టీప్లెక్స్ థియేటర్స్ ను వీలైనంత ఎక్కువ చోట్ల ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు వేసుకుంటున్నారు. అందులో భాగంగా ప్రస్తుతం సిలికాన్ సిటీ బెంగళూరుపై దృష్టి పెట్టారు.
త్వరలో AMB మల్టీప్లెక్స్ థియేటర్ ని ఏషియన్ వారితో కలిసి బెంగళూరులో మహేష్ బాబు ప్రారంభించబోతున్నట్లుగా తెలుస్తోంది. బెంగళూరులో ఇప్పటికే పివిఆర్ ఐనాక్స్ మల్టీప్లెక్స్ థియేటర్స్ చైన్ ఉంది. AMB మల్టీప్లెక్స్ అక్కడ ఏర్పాటు చేస్తే కచ్చితంగా వారికి పోటీ అయ్యే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా AMB మల్టీప్లెక్స్ థియేటర్స్ ఏర్పాటు చేసే ప్లానింగ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఉన్నట్లుగా టాక్ నడుస్తుంది.
మల్టీప్లెక్స్ థియేటర్స్ లో AMB అనే బ్రాండ్ ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి సూపర్ స్టార్ గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. రాజమౌళితో ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు పాన్ వరల్డ్ మూవీ చేయబోతున్నారు. ఈ సినిమా తర్వాత అతని బ్రాండ్ వాల్యూ కూడా అమాంతం పెరిగే ఛాన్స్ ఉంది. అప్పుడు AMB మల్టీప్లెక్స్ బ్రాండ్ ను కూడా దేశవ్యాప్తంగా విస్తరించడానికి ఛాన్స్ దొరుకుతుందని భావిస్తున్నారు.
అలాగే ప్రొడ్యూసర్ గా కూడా కొత్త కథలతో వచ్చే దర్శకులకి అవకాశం ఇచ్చి ఎంకరేజ్ చేయాలని మహేష్ బాబు అనుకుంటున్నారు. మహేష్ బాబు బ్యానర్ లో అడవి శేష్ మేజర్ అనే మూవీ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. నెక్స్ట్ చేయబోయే మూవీ కూడా ఆ రేంజ్ లో పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటే ప్రాజెక్ట్ తో రావాలని అనుకుంటున్నారు. మరో వైపు మహేష్ బాబు రూట్ లోనే అల్లు అర్జున్ ఇప్పటికే మల్టీప్లెక్స్ థియేటర్స్ బిజినెస్ లోకి అడుగుపెట్టాడు. రవితేజ కూడా పెట్టుబడులు పెడుతున్నారు. వీరందరూ కూడా కామన్ ఏషియన్ వారితో టై అప్ అయ్యి ఈ మల్టీప్లెక్స్ చైన్ ని డెవలప్ చేస్తూ ఉండటం విశేషం.