మహేష్‌తో రాజమౌళి.. ఆ నవలలే స్ఫూర్తి!
మహేష్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు కాల్షీట్లను కేటాయించారు. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న `గుంటూరు కారం` విడుదలయ్యాక మహేష్ తదుపరి రాజమౌళితో షూటింగ్‌ని ప్రారంభిస్తారని సమాచారం.
By: Tupaki Desk | 14 Nov 2023 4:56 AM GMTమహేష్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు కాల్షీట్లను కేటాయించారు. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న `గుంటూరు కారం` విడుదలయ్యాక మహేష్ తదుపరి రాజమౌళితో షూటింగ్‌ని ప్రారంభిస్తారని సమాచారం. అప్పటికి అన్ని కమిట్‌మెంట్‌ల నుండి పూర్తిగా విముక్తుడు అవుతాడు. అదే సమయానికి రాజమౌళి- విజయేంద్ర ప్రసాద్ బృందం దాదాపుగా ప్రీప్రొడక్షన్ పనులను, కాస్టింగ్ ఎంపికలను కూడా పూర్తి చేస్తారని సమాచారం. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు స్పీడ్ గా జరుగుతున్నాయి.
ఈ సినిమా కథాంశం గురించి ఇప్పటికే కొంత సమాచారం ఉంది. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో ఆద్యంతం రక్తి కట్టించే ఎలిమెంట్స్ తో సినిమా రక్తి కట్టిస్తుందని ఇంతకుముందు కథనాలొచ్చాయి. రచయిత వి.విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రం మూల కథ ఆఫ్రికా అడవుల్లోని నాగరికత ఆధారంగా కొనసాగుతుందని తెలిపారు.
అయితే ఈ కథను ఎలా దక్కించుకున్నారు? అన్నదానికి తాజాగా సమాచారం అందింది. పాపులర్ అంతర్జాతీయ నవల ఆధారంగా ఈ సినిమాని రెండు భాగాలుగా రూపొందించనున్నారని, ఈ సిరీస్ హక్కులను పొందడం విజయవంతంగా పూర్తి చేసారని సమాచారం. ప్రముఖ రచయిత విల్బర్ స్మిత్ నవలల ఆధారంగా స్క్రిప్టును మలిచారని కూడా తెలిసింది.
విల్బర్ స్మిత్ పాపులర్ నవలలు `ది బాలంటైన్` టైటిల్ తో ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతాయి. నవలల హక్కులను రాజమౌళి- కె.ఎల్ నారాయణ బృందం ఛేజిక్కించుకున్నారని తెలిసింది. బాలంటైన్ కుటుంబ జీవితాలను ఈ నవలల్లో స్పర్శించారు. మూడు దశాబ్దాల కాలంలో ప్రచురించిన కథలు ఇవి. సిరీస్‌లో మొత్తం ఏడు నవలలు ఉన్నాయి. అయితే మొత్తం నవలలపై కాపీరైట్ హక్కులను రాజమౌళి నిర్మాతలు దక్కించుకున్నారా లేదా? అన్నదానికి సరైన క్లారిటీ రాలేదు. బాహుబలి-బాహుబలి2-ఆర్.ఆర్.ఆర్ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ భారీ చిత్రాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మహేష్ తో రెండు భాగాలుగా సినిమాని తెరకెక్కిస్తారని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే వీటిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదు.