Begin typing your search above and press return to search.

'మహేష్ - రాజమౌళి.. రంగంలోకి ఆ హీరో కూడా..

ఈ సినిమాలో సౌత్ ఇండస్ట్రీకి చెందిన పలువురు స్టార్స్ నటిస్తారని రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇటీవలే వెల్లడించిన విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   1 Feb 2024 9:47 AM GMT
మహేష్ - రాజమౌళి.. రంగంలోకి ఆ హీరో కూడా..
X

ఈ సంక్రాంతికి 'గుంటూరు కారం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు తన తదుపరి చిత్రాన్ని ఎస్. ఎస్ రాజమౌళితో చేయబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా కోసం మహేష్ వర్క్ షాప్ మొదలెట్టాడు. రాజమౌళి సినిమా కోసం జర్మనీలో తెగ కష్టపడుతున్నాడు. ఇక మరోవైపు ఇటీవల స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయిన ఈ ప్రాజెక్టు కోసం రాజమౌళి నటీనటుల ఎంపికలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.



ఈ సినిమాలో సౌత్ ఇండస్ట్రీకి చెందిన పలువురు స్టార్స్ నటిస్తారని రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇటీవలే వెల్లడించిన విషయం తెలిసిందే. ఇలాంటి తరుణంలో ఈ ప్రాజెక్టులో సీనియర్ హీరో కింగ్ నాగార్జున ని కూడా ఓ కీలక పాత్ర కోసం తీసుకోవాలనే ఆలోచనలో రాజమౌళి ఉన్నట్లు తెలుస్తోంది. నాగార్జునతో రాజమౌళి కి మంచి అనుబంధం ఉంది. గతంలో నాగర్జున 'రాజన్న' సినిమాకు రాజమౌళి కొంత వర్క్ కూడా చేశారు.

ఎందుకంటే ఆ సినిమాకు ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహించారు. మరోవైపు రాజమౌళి, మహేష్ బాబు సినిమా నిర్మాత కె.ఎల్. నారాయణతోను నాగార్జునకు మంచి బాండింగ్ ఉంది. గతంలో నాగార్జునతో కేఎల్ నారాయణ కొన్ని సినిమాలను కూడా నిర్మించారు. ఇవన్నీ ఓకెత్తు అయితే.. నాగార్జునకి బాలీవుడ్ లో మంచి గుర్తింపు ఉంది. గతంలో నాగ్ హిందీలోనూ కొన్ని సినిమాలు చేశారు.

రీసెంట్ టైమ్స్ లో చూసుకుంటే 'బ్రహ్మాస్త్ర' సిరీస్ లోనూ కీ రోల్ ప్లే చేశారు. నేషనల్ వైడ్ గా గుర్తుపట్టే తెలుగు హీరోల్లో నాగార్జున కూడా ఒకరు కాబట్టి 'SSMB29' లో ఓ కీలకపాత్ర కోసం నాగార్జునను రాజమౌళి తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. రాజమౌళి సినిమాలో కీలక పాత్రలు ఎలాగూ ఉంటాయి. కాబట్టి 'SSMB29' మూవీలో నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నాడని వార్త ఫిలిం సర్కిల్స్ లోనూ ప్రచారం అవుతుంది.

మరి ఇందులో ఎంత వాస్తవం ఉందనేది తెలియాలంటే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు వేచి చూడాల్సిందే. ఇక ఏప్రిల్ లో ఈ ప్రాజెక్టు పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ కాబోతోంది. సుమారు 1000 కోట్లకి పైగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ స్థాయిలో రూపొందించబోతున్నారు.