మహేష్-నమ్రతల ఆస్తులు..అంతస్తులు!
సూపర్ స్టార్ మహేష్-నమ్రత జోడీ గురించి చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ లో ఆదర్శ దంపతులుగా ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు
By: Tupaki Desk | 12 Feb 2024 9:58 AM GMTసూపర్ స్టార్ మహేష్-నమ్రత జోడీ గురించి చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ లో ఆదర్శ దంపతులుగా ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు. ఇక పిల్లలు గౌతమ్..సితార ఎంతో యాక్టివ్ గా ఉంటారు. గౌతమ్ మహేష్ లా కాస్త సిగ్గరి అయినా..సితార మాత్రం అమ్మలా ఎంతో యాక్టివ్. సినిమాలంటే ఎంతో ఆసక్తి. ఆ ఫ్యాషన్ తోనే చిన్నప్పటి నుంచే తన ఆసక్తిని చూపిస్తుంది. డాన్సు చేయడండలో సితార మార్క్ ఎప్పుడో వేసింది. సితార తెరంగేట్రానికి ముందే సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ దక్కించుకుంది.
తండ్రి వారసత్వాన్ని తనయుడు కొనసాగిస్తాడా? లేదా? అన్నది తెలియదు గానీ సితార స్పీడ్ చూస్తుంటే డాడి ఇమేజ్ ని ఖాయంగానే కనిపిస్తుంది. ఆ సంగతి పక్కనబెడితే ఫిబ్రవరి 10 నాటికి మహేష్ నమ్రత వివాహం జరిగి 19 ఏళ్లు పూర్తయింది. 2005 ఫిబ్రవరి 10న ఇద్దరు వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత నమ్రత సినిమాలకు దూరమవ్వడం...బిజినెస్ లోకి ఎంటర్ అవ్వడం తెలిసిందే. తాజాగా మహేష్ ఆస్తుల వివరాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆ సంగతి చూస్తే మహేష్ నికర ఆస్తుల విలువ 273 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. కేవలం నమ్రత వ్యాపార రంగం ద్వారా 50 కోట్ల వరకు సంపాదించినట్లు నివేదికలు సూచిస్తున్నాయి.
మొత్తం ఇద్దరి ఆదాయం కలిపితే 320 కోట్లగా తెలుస్తుంది. ఈ జోడీ ఖరీదైన ఏరియాల్లో విల్లాలు కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లోని ఎలైట్ జూబ్లీహిల్స్‌లో ఉన్న ఇళ్లు దాదాపు రూ. 28 కోట్లు ఉంటుందిట. ఇలాంటి ఇళ్లు భాగ్యనగరంలో ఇంకా రెండు..మూడు ఉన్నాయని సమాచారం. అలాగే సిలికాన్ సిటీ బెంగుళూరు ప్రైమ్ ఏరియాలో సొంతంగా ఓ ఇల్లు ఉందిట. లైఫ్ స్టైల్ ఆసియా సీఎన్ బీసీ నివేదికల ప్రకారం మహేష్ ఇటీవలే మరో కొత్తింటిని కూడా కొనుగోలు చేసారుట.
అలాగే ఖలీజ్ టైమ్స్ నివేదికల ప్రకారం ఏప్రిల్ లో దుబాయ్ లో సముద్రతీరాన్ని అనుకుని ఓ ఇంటిని కొనుగోలు చేసారుట. ఇంకా హైదరాబాద్ లోని ఏఎంబీ మాల్ లో మహేష్ భారీ వాటా కలిగిని సంగతి తెలిసిందే. ఈ మల్టీప్లెక్స్ బిజినెస్ ని మెట్రో నగరాలన్నింటికి విస్తరించాలని చాలా కాలంగా ప్లానింగ్ లో ఉన్నారు. వైజాగ్ లోనూ భారీ ఎత్తున ఏఎంబీని స్థాపించాలని చూస్తున్నట్లు తెలిసింది. అలాగే రోడ్ నెం.12లో బంజారాహిల్స్ లో ఉన్న ఏఎన్ ప్యాలెస్ హైట్స్ వైఫ్ అండ్ హబ్బీ టేస్ట్ కి తగ్గట్టు ఉంటుందిట.