Begin typing your search above and press return to search.

అంబానీ పెళ్లిలో జాన్ విక్ ఆఫ్ ఇండియా!

వాళ్ల‌తో క‌లిసి పోయి స‌ర‌దా వాతావ‌ర‌ణాన్ని సృష్టిస్తున్నారు. ఇటీవ‌లే మ‌హేష్ కుటుంబానికి సంబంధించిన ఈవెంట్ లో త‌ళుక్కున మెరిసారు.

By:  Tupaki Desk   |   13 July 2024 7:56 AM GMT
అంబానీ పెళ్లిలో జాన్ విక్ ఆఫ్ ఇండియా!
X

సూప‌ర్ స్టార్ మ‌హేష్ లో ఇప్పుడెన్నో ఛేంజెస్ క‌నిపిస్తున్నాయి. ఒక‌ప్పుడు రిజ‌ర్వ‌ర్డ్ గా ఉండే మ‌హేష్ ఇప్పుడెంతో ఎన‌ర్జీని చూపిస్తున్నారు. ముఖ్యంగా చాలాకాలం వ‌ర‌కూ ఫ్యామిలీ ఫంక్ష‌న్లు త‌ప్ప బ‌య‌ట వేడుక‌ల్లో ఎక్క‌డా క‌నిపించేవారు. కానీ ఇప్పుడు అలాంటి భేష‌జం లేకుండా హాజ‌ర‌వుతున్నారు. బంధు వ‌ర్గం, స్నేహితుల ఇళ్ల‌లో వేడుక‌లు జ‌రుగుతుంటే ఫ్యామిలీతో త‌ప్ప‌కుండా హాజ‌ర‌వుతున్నారు.

వాళ్ల‌తో క‌లిసి పోయి స‌ర‌దా వాతావ‌ర‌ణాన్ని సృష్టిస్తున్నారు. ఇటీవ‌లే మ‌హేష్ కుటుంబానికి సంబంధించిన ఈవెంట్ లో త‌ళుక్కున మెరిసారు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ నిన్న‌టి రోజును అంబానీ ఇంట జ‌రిగిన వివాహ వేడుక‌కు స‌తీస‌మేతంగా హాజ‌రైన సంగ‌తి తెలిసిందే. భార్య న‌మ్ర‌త శిరోద్క‌ర్ , కుమార్తె సితార‌తో క‌లిసి అనంత్ అంబానీ-రాధిక మ‌ర్చంట్ వివాహానికి హాజ‌రైన నూత‌న వ‌ధువరుల‌ను ఆశీర్వ‌దించారు.

ఈ పెళ్లి కోసం మ‌హేష్ ఎంతో ప్ర‌త్యేకంగా హైలైట్ అయ్యారు. బ్లూ క‌ల‌ర్ ఫైజామా షూట్ లో మ‌హేష్ ఎంతో మ‌నోహారంగా ముస్తాబ‌య్యారు. అత‌డి లాంగ్ హెయిర్ స్టైల్ డ్రెస్ ని ప‌ర్పెక్ట్ గా మ్యాచ్ చేసింది. హెయిర్ స్టైల్...శ‌రీర కొల‌త‌ల‌కు త‌గ్గ ప‌ర్పెక్ట్ ఔట్ ఫిట్ లో ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తున్నారు. ఇంత‌వ‌ర‌కూ మ‌హేష్ ఏ ఈవెంట్ కోసం ఇలాంటి దుస్తులు ధ‌రించింది లేదు. ఎలాంటి ఈవెంట్కి వెళ్లినా క్యాజువ‌ల్స్ లోనే హాజ‌ర‌వుతారు. కానీ ఇది అంబానీ ఇంట పెళ్లి కావ‌డంతో ప్ర‌త్యేకంగా డిజైన‌ర్ షూట్ లో మెరిసారు.

మ‌హేష్ బ్యూటీకి నెటి జ‌నులంతా ఫిదా అవుతున్నారు అత‌డి బ్యూటీని ఉద్దేశించి ఆస‌క్తిక‌ర పోస్టులు పెడుతున్నారు. జాన్ విక్ ఆఫ్ ఇండియా అంటూ ఒక‌రు కామెంట్ చేయ‌గా..మ‌రొక‌రు గ్రీక్ గాడ్ తో పోల్చారు. హాలీవుడ్ స్టార్ అంటూ ఇంకొక‌రు పోస్టులు పెట్టారు. ఇక గాళ్స్ పోస్ట్ లు గురించైతే చెప్పాల్సిన ప‌నిలేదు. ఇక రాజ‌మౌళి సినిమా త‌ర్వాత మ‌హేష్ హాలీవుడ్ రేంజ్ స్టార్ అని ప్రూవ్ అవుతుంది.