Begin typing your search above and press return to search.

పెళ్లిలో ప్రిన్స్ ఫ్యామిలీ ఎంత అందంగా అంటే!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ స‌తీస‌మేతంగా అంబానీ ఇంట పెళ్లి వేడుక‌కు హాజ‌రైన సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   15 July 2024 6:57 AM GMT
పెళ్లిలో ప్రిన్స్ ఫ్యామిలీ ఎంత అందంగా అంటే!
X

సూప‌ర్ స్టార్ మ‌హేష్ స‌తీస‌మేతంగా అంబానీ ఇంట పెళ్లి వేడుక‌కు హాజ‌రైన సంగ‌తి తెలిసిందే. మ‌హేష్‌..న‌మ్ర‌త‌...కుమార్తె సితార క‌లిసి ఈ వివాహానికి హాజ‌ర‌య్యారు. ఇక ఈ వేడుక కోసం మ‌హేష్ ఫ్యామిలీ ముస్తాబైన విధానం చూప‌రుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. మ‌హేష్ ఫైజామా షూట్ అచ్చం రాకుమారుడినే త‌ల‌పించాడు. డిజైన‌ర్ దుస్తుల్లో ఎంతో మ‌నోహానంగా ముస్తాబ‌య్యాడు. అతడి హెయిర్ స్టైల్ - డ్రెస్-పెదాల‌పై స‌న్న‌ని న‌వ్వు మ‌హేష్ కి ఎంతో బ్యూటీని జోడించింది.

మామూలుగా మ‌హేష్ అంద‌గాడు. అలాంటి అందానికి ఇలాంటి ఎలివేష‌న్ తోడైతే! ఎలా ఉంటుందో చెప్పాల్సిన ప‌నిలేదు. ఇక్క ప‌క్క‌నే భార్య న‌మ్ర‌తా శిరోద్క‌ర్ ఎంతో అందంగా ముస్తాబ‌య్యారు. వైట్ క‌ల‌ర్ డిజైన‌ర్ దుస్తుల్లో ఆక‌ర్ష‌ణీయంగా ఆక‌ట్టుకుంటున్నారు. గోల్డ్ క‌ల‌ర్ హెయిర్ స్టైల్..నెక్ పై డ్రెస్ ని మ్యాచ్ చేస్తూ డిజైన్ చేసిన నెక్లెస్ ఆమెని మ‌రింత అందంగా తీర్చిదిద్దాయి. మ‌రోవైపు కుమార్తె సితార సైతం అంతే అందంగా ముస్తాబైంది.

అచ్చ‌గా అమ్మ‌ని పోలిన దుస్తుల్లోనే మెరిసింది. ఫోటో సెష‌న్ లో భాగంగా ముగ్గురు ఒకేచోట న‌వ్వుతూ కెమారికి ఫోజులిచ్చారు. ఆ ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. మ‌హేష్ ఇలా వేడుల‌కు రావ‌డం అన్న‌ది చాలా రేర్. కావాల్సిన వారి వేడుక‌లు అయితే త‌ప్ప హాజ‌రు కారు. ద‌గ్గ‌ర బంధువులు, ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోల ఈవెంట్ల‌కు మాత్ర‌మే హాజ‌ర‌వుతుంటారు. అంబానీ ఇంట వేడుక‌కు హాజ‌వ్వ‌డం అన్న‌ది ఇదే తొలిసారి.

మ‌హేష్ ముంబై ప‌రిచ‌యాలు ప‌క్క‌న‌బెడితే న‌మ్ర‌త‌కి బాలీవుడ్ సెల‌బ్రిటీలో మంచి స్నేహాలు ఉన్నాయి. ప్ర‌త్యేకంగా అంబానీ ఇంట వేడుక‌కు వెళ్ల‌డానికి కార‌ణం కూడా ఆమె అని నెట్టింట ప్రచారం సాగుతోంది. త్వ‌ర‌లో మ‌హేష్ పాన్ ఇండియా లో ప‌రిచ‌యం అవుతున్నారు. అంత‌కు ముందే జ‌రిగిన ఈవేడుక అత‌డికి క‌లిసొచ్చేదే. కొత్త ప‌రిచ‌యాలు చేసేందుకు, పాత ప‌రిచ‌యాల్ని గుర్తు చేసేందుకు ఇది స‌రైన వేదిక.