Begin typing your search above and press return to search.

జక్కన్న కండిషన్ ను మహేష్ బ్రేక్ చేసినట్లేనా?

ఇలా తన స్టైలిష్ లుక్ తో అందరినీ అలరించాడు, ఆశ్చర్యపరిచాడు కానీ... రాజమౌళికి ఇచ్చిన మాట మాత్రం తప్పాడనే కామెంట్లు ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి.

By:  Tupaki Desk   |   17 July 2024 12:26 PM GMT
జక్కన్న కండిషన్  ను మహేష్  బ్రేక్  చేసినట్లేనా?
X

ట్రిపుల్ ఆర్ సక్సెస్ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి - సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఎస్.ఎస్.ఎం.బీ29 చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. ఈ భారీ బడ్జెట్ చిత్ర గురించి తెలిసినప్పటి నుంచీ సినీ ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. దీంతో... భారత చలనచిత్ర చరిత్రలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఇది ఒకటనే కామెంట్లు బలంగా వినిపిస్తున్నాయి.

ఈ సమయంలో మహేష్ బాబుకు రాజమౌళి ఓ కండిషన్ పెట్టారని అంటున్నారు. అయితే తాజాగా ఆ కండిషన్స్ ను సూపర్ స్టార్ బ్రేక్ చేశాడని చెబుతున్నారు. అదే నిజమైతే... దీనిపై రాజమౌళి రియాక్షన్ ఏమిటనేది ఆసక్తిగా మారింది. ఇలా రాజమౌళి కండిషన్ ను మహేష్ బ్రేక్ చేయడానికి కారణం ఇటీవల అంబానీ ఇంట్లో జరిగిన వివాహ వేడుక అని అంటున్నారు.

అవును... ఇటీవల ముకేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ఈ వివాహ వేడుకకు టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడు, మల్లూవుడ్, హాలీవుడ్ అనే తేడాలేమీ లేకుండా... చాలామంది సెలబ్రెటీలు, సూపర్ స్టార్లు, టెక్నీషియన్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.. సందడి చేశారు.

ఇలా అంగరంగ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో... కుటుంబ సమేతంగా మహేష్ బాబు దర్శనమిచ్చారు. తనదైన స్టైలిష్ లుక్ తో అందరి దృష్టినీ ఆకర్షించారు. ఇలా తన స్టైలిష్ లుక్ తో అందరినీ అలరించాడు, ఆశ్చర్యపరిచాడు కానీ... రాజమౌళికి ఇచ్చిన మాట మాత్రం తప్పాడనే కామెంట్లు ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి.

ఇందులో భాగంగా... మహేష్ బాబు లుక్ ని రివీల్ చేయొద్దని రాజమౌళి కండిషన్ పెట్టారంట. అయితే... అంబానీ ఇంట పెళ్లి పుణ్యమాని మహేష్ బాబు ఆ కండిషన్ ను బ్రేక్ చేయాల్సి వచ్చింది. దీంతో... ఈ కండిషన్ నిజమైతే... ఈ వ్యవహారంపై జక్కన్న ఎలా రియాక్ట్ అవుతారనేది ఆసక్తిగా మారిందని అంటున్నారు!