Begin typing your search above and press return to search.

2024 నుంచి మ‌హేష్ అన్ని బంద్ పెట్టాల్సిందే!

టాలీవుడ్ హీరోల్లో ఏటా ఐదారుసార్లు విదేశాల‌కు వెకేష‌న్ల‌కు వెళ్లేది ఎవ‌రంటే? మ‌హేష్ ఫ్యామిలీనే గుర్తొస్తుంది.

By:  Tupaki Desk   |   18 Nov 2023 8:58 AM GMT
2024  నుంచి మ‌హేష్ అన్ని బంద్ పెట్టాల్సిందే!
X

టాలీవుడ్ హీరోల్లో ఏటా ఐదారుసార్లు విదేశాల‌కు వెకేష‌న్ల‌కు వెళ్లేది ఎవ‌రంటే? మ‌హేష్ ఫ్యామిలీనే గుర్తొస్తుంది. వృత్తిప‌రంగా ఎంత బిజీగా ఉన్నా ఏడాదిలో మినిమంలో మిన‌మం ఐదు ట్రిప్ లు అయినా వేయాల్సిందే అంటారు. ఆ ప్లానింగ్ అంతా ముందే ఫిక్సై ఉంటుంది. స‌రిగ్గా పిల్ల‌ల‌కు సెల‌వులు..మ‌హేష్ షెడ్యూల్స్ చూసుకుని ప్లాన్ చేసుకుంటారు. ఆ ప్లాన్ ప్ర‌కారం ఓ వారం ..ప‌దిరోజులు విదేశాల్లో ఆస్వాదించి వ‌స్తుంటారు.

ఇలా ప్లానింగ్ చేయ‌డం..వెకేష‌న్ల‌కు వెళ్ల‌డం అన్న‌ది సూప‌ర్ స్టార్ ఫ్యామిలీకే చెల్లింది. ఇంకే హీరో కూడా ఇలా వెకేష‌న్ల‌ను ప్లాన్ చేయ‌లేరు. అయితే ఈ లెక్కంతా 2023 తో మ‌హేష్ స‌రిపెట్టాల్సి ఉంటుందేమో. 2024 నుంచి మ‌హేష్ ఎంత బిజీగా ఉంటాడో తెలిసిందే. వ‌చ్చే ఏడాదే అడ్వెంచ‌ర్ థ్రిల్ల‌ర్ మ‌హేష్ హీరోగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ప్రారంభ‌మ‌వుతుంది. జ‌క్క‌న్న సీన్ లోకి దిగాడంటే స‌న్నివేశం ఎలా ఉంటుందో అత‌నితో ప‌నిచేసిన వారికి తెలుస్తుంది.

తార‌క్..చ‌ర‌ణ్‌..ప్ర‌భాస్..రానా లాంటి న‌టుల్ని అడిగితే రాజ‌మౌళితో ప‌ని ఒత్తిడి ఎలా ఉంటుందో తెలుస్తుం ది. మ‌హేష్ ప్రాజెక్ట్ గ‌నుక మొద‌లైతే అత‌ను కూడా అంతే బాండ్ అయి ప‌నిచేయాల్సి ఉంటుంది. రాజ‌మౌ ళి షూటింగ్ మొదలైందంటే? ముగించే వ‌ర‌కూ ఎటూ క‌ద‌ల‌డానికి వీలుండ‌దు. రాజ‌మౌళి వెంటే హీరో ఉండాల్సి ఉంటుంది. అది ఇండియాలో అయినా..విదేశాల్లో షూటింగ్ అయినా స‌రే.

సెట్స్ దాటి బ‌య‌ట‌కు వెళ్ల‌డానికి జ‌క్క‌న్న ఒప్పుకోడు. వీలుంటే త‌న‌తో పాటు అక్క‌డే చిన్న‌పాటి ఇల్లు నిర్మించుకోమంటారు. రాజ‌మౌళి ఫ్యామిలీ బాహుబ‌లి..ఆర్ ఆర్ ఆర్ లాంటి ప్ర‌తిష్టాత్మ‌క చిత్రాలు అలాగే పూర్తిచేసింది. ఆయ‌నంత బాండ్ అయిన ప‌నిచేసారు కాబ‌ట్టే అంత గొప్ప ఔట్ ఫుట్ వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో మ‌హేష్ కూడా అలాగే ప‌నిచేయాల్సి ఉంటుంది. ఒన్స్ మొద‌లైన త‌ర్వాత మ‌హేష్ వెకేష‌న్ల‌కు వెళ్లే అవ‌కాశం చాలా త‌క్కువ‌. అప్పుడా బాద్య‌త మొత్తం న‌మ్ర‌త తీసుకోవాల్సి ఉంటుంది.