అలిపిరిలో కాలినడకన.. భక్తులతో గౌతమ్ కృష్ణ సింపుల్‌గా..!
త్వరలోనే తండ్రి బాటలో హీరో అవుతాడని కూడా అభిమానులు భావిస్తున్నారు.
By: Tupaki Desk | 15 Aug 2024 4:03 AM GMTఅతడు నడుస్తుంటే రాజసం కనిపించింది. ఒక రకంగా రాజకుమారుడినే తలపించాడు. తండ్రి మహేష్ బాబు లానే ఎంతో సింప్లిసిటీతో కనిపించే గౌతమ్ కృష్ణ చూస్తుండగానే పెద్ద వాడైపోయాడు. టీనేజీ కుర్రాడి టింజ్ అతడిలో స్పష్ఠంగా కనిపిస్తోంది. ఇప్పుడు అమెరికా- న్యూయార్క్ వర్శిటీలో విద్యాభ్యాసం సాగిస్తున్న గౌతమ్ అక్కడే పాపులర్ ఫిలింఇనిస్టిట్యూట్‌లో నటశిక్షణ తీసుకుంటున్నాడని ఇంతకుముందు మీడియాలో కథనాలొచ్చాయి. త్వరలోనే తండ్రి బాటలో హీరో అవుతాడని కూడా అభిమానులు భావిస్తున్నారు.
ప్రస్తుతం హైదరాబాద్ లో తన నివాసానికి వచ్చిన గౌతమ్ కృష్ణ తన తల్లి నమ్రత శిరోద్కర్, సోదరి సితార ఘట్టమనేని సహా తిరుమల తిరుపతి వెంకటేశుని సన్నిధానంలో స్వామివారికి భక్తి శ్రద్ధలతో పూజలాచరించాడు. సూపర్ స్టార్ మహేష్ కుటుంబం స్వామివారి సేవలో తరించింది. అయితే మహేష్ బాబు కుటుంబ సభ్యులు వేకువఝాము పూజా కార్యక్రమాల కోసం అలిపిరి మార్గంలో కాలినడకన తిరుమలేశుని వద్దకు చేరుకున్నారు.
మహేష్ బాబు సతీమణి నమ్రత, సితార ఘట్టమనేని, ఆద్యలతో పాటు గౌతమ్ కృష్ణ కాలినడకన వెళుతూ కనిపించాడు. సాధారణ భక్తులతో వారి ప్రయాణం ఎంతో సింపుల్ గా సాగింది. ముఖ్యంగా మార్గమధ్యంలో అభిమానులతో ముచ్చటిస్తూ ఎంతో సులువుగా కలిసిపోయారు ఈ కుటుంబీకులు. చాలా సాధారణ భక్తుల్లా వారు స్వామివారి చెంతకు భక్తి శ్రద్ధలతో వెళుతూ కనిపించారు. తమకు ఎస్కార్ట్ గా వచ్చిన సహాయకులు, భక్తులందరికీ నమ్రత ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతుండడం అందరి దృష్టిని ఆకర్షించింది.
స్టార్‌డమ్ .. సెలబ్రిటీ హోదాను మించి అందరితో సున్నితంగా కలిసిపోవడం అనేది సూపర్ స్టార్ కృష్ణ నుంచి వస్తున్న గొప్ప క్వాలిటీ. దానిని మహేష్ తన వారసులకు కూడా అలవరిచారు. గౌతమ్ కృష్ణ ఎంతో సింపుల్ గా కనిపించారు. తనలోని భక్తి శ్రద్ధలను కనబరుస్తూ స్వామివారిని మొక్కుతూ అలిపిరి మార్గంలో అందరి దృష్టిని ఆకర్షించారు. అభిమానంగా సెల్ఫీ కోరితే దానికి సహకరించాడు. జీవితంలో గొప్ప ఎదుగుదల అంటే సంపదల సృష్టి మాత్రమే కాదు ఆధ్యాత్మిక మార్గం, సరళంగా జీవించడం అని గురువులు చెబుతున్నారు. దీనిని చాలామంది సెలబ్రిటీలు అనుసరిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబం సాధారణ ప్రజలతో కలిసిపోయే తీరు, వినమ్రత అందరినీ ఆకట్టుకుంటుంది. వారి సామాజిక సేవాకార్యక్రమాలు ఎందరికో ఆలంబనగా నిలుస్తున్నాయి.