మహేష్ ఫ్యామిలీ వెకేషన్..స్పాట్ ఎక్కడంటే?
ఎస్ ఎంబీ 29 లాంచింగ్ ఏ క్షణమైనా జరిగే అవకాశం ఉంది. దర్శకుడు రాజమౌళి అండ్ కో ఆ సినిమా పనుల్లోనే బిజీగా ఉంది
By: Tupaki Desk | 14 Jun 2024 12:10 PM GMTఎస్ ఎంబీ 29 లాంచింగ్ ఏ క్షణమైనా జరిగే అవకాశం ఉంది. దర్శకుడు రాజమౌళి అండ్ కో ఆ సినిమా పనుల్లోనే బిజీగా ఉంది. వన్స్ మొదలైన తర్వాత మహేష్ ఎటూ కదలడానికి వీలుడుందు. వెకేషన్లు.. టూర్లు అంటే కుదరదు. ఏదైనా సినిమా రెగ్యులర్ షూటింగ్ వెళ్లడానికి ముందే. ఇప్పటికే మహేష్ కూడా టీమ్ తో జాయిన్ అయ్యాడు. జర్మనీలో సినిమాకి అవసరమైన ట్రైనింగ్ కూడా పూర్తి చేసారు.
ఈ నేపథ్యంలో మహేష్ ఇక వెకేషన్లకు వెళ్లే అవకాశం లేదనుకున్నారంతా? కానీ తాజాగా ఆయన నేడు ఫ్యామిలీతో హైదరాబాద్ ఎయిర్ పోర్టులో చిక్కారు. భార్య నమత్ర, పిల్లలు గౌతమ్, సితారతో కలిసి విదేశాలకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఇంటర్నెట్ లో కొన్ని ఫోటోలు వైరల్ అవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మహేష్ బ్లాక్ ట్రాక్ ప్యాంట్‌తో కూడిన బ్రౌన్ జాకెట్ మరియు డార్క్ షేడ్స్ ఉన్న క్యాప్‌ని ధరించారు.
మరో చిత్రంలో సితార , గౌతమ్ కలిసి సంభాషణలో నిమగ్నమై ఉన్నారు. గౌతమ్ బూడిద రంగు ప్యాంటు - షేడ్స్‌తో కూడిన స్కై-బ్లూ స్వెట్‌షర్ట్‌ని ధరించాడు. నమ్రత చారల టీ-షర్టు పై స్కై బ్లూ కోట్‌లో పార్మల్ గా కనిపిస్తున్నారు. సితార ఇన్ స్టాలో 'ఎయిర్‌పోర్ట్‌మాక్స్ @గౌతమ్‌ఘట్టమనేని' అని రాసుకొచ్చింది. దీంతో ఇది వెకేషన్ లా అనిపించలేదు. గౌతమ్ అమెరికాలోని న్యూయార్క్ లో చదువుకుంటోన్న సంగతి తెలిసిందే.
మహేష్ ఫ్యామిలీ కూడా ప్రత్యేకంగా గౌతమ్ చదువు నిమిత్తమే న్యూయార్క్ వెళ్తున్నట్లు తెలుస్తోంది. పనిలో పనిగా వెకేషన్ కూడా పూర్తవుతుంది. ఇలా రెండు పనులు పూర్తవుతాయని ఫ్యామిలీ మొత్తం ప్లైట్ ఎక్కినట్లు తెలుస్తోంది. ఇక్కడ రాజమౌళి కూడా రెగ్యులర్ షూట్ కి రెడీ అవుతోన్న నేపథ్యంలో ఎక్కువ రోజులు ఉండే అవకాశం లేదు.