Begin typing your search above and press return to search.

SSMB29: మహేష్ ఎక్కడ?

తెలుగు సినీ పరిశ్రమలో వయసు పెరుగుతున్నా కూడా కొంతమంది హీరోలు ఇంకా యువ హీరోల తరహాలోనే కనిపిస్తున్నారు.

By:  Tupaki Desk   |   9 Aug 2024 9:29 AM GMT
SSMB29: మహేష్ ఎక్కడ?
X

తెలుగు సినీ పరిశ్రమలో వయసు పెరుగుతున్నా కూడా కొంతమంది హీరోలు ఇంకా యువ హీరోల తరహాలోనే కనిపిస్తున్నారు. ఇక అందులో మహేష్ బాబు టాప్ లిస్టులో ఉంటారని చెప్పవచ్చు. ఇక ఇండస్ట్రీలో ఇప్పటికే 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సూపర్‌స్టార్ మహేష్ బాబు నేడు 49వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఇక మహేష్ తన పుట్టినరోజును ఎప్పుడూ కూడా ఫ్యామిలీతో కలిసి సెలెబ్రెట్ చేసుకుంటాడు.

వీలైనంత వరకు వేరే దేశానికి వెళ్లి తన పిల్లలతో హ్యాపీగా ఉండేందుకు ప్లాన్ చేసుకుంటాడు. ఇప్పుడు కూడా మహేష్ అదే తరహాలో తన పుట్టినరోజు వేడుకల్ని విదేశాల్లో జరుపుకుంటున్నారు. హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ఆయన లాంగ్ హెయిర్, బర్డ్ లుక్‌తో కనిపించడం ఆసక్తికరమైన అంశం. అతని తాజా లుక్‌తో ప్రేక్షకులు, అభిమానులు ఆశ్చర్యపోయారు.

మహేష్ బాబు తన కొత్త చిత్రానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందనున్న ఆ సినిమాలో మహేష్ తన ఫిట్నెస్ లో మార్పులు చేస్తున్నాడు, అతని ప్రస్తుత లుక్‌ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఈ కొత్త ప్రాజెక్ట్ కోసం మహేష్ బాబు కొన్ని ఆహార నియమాలను పాటిస్తూ, తన శారీరక మరియు మానసిక సిద్ధతను మెరుగుపరుచుకుంటున్నారు.

రాజమౌళి తాజా చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు మరింత సమయం తీసుకోవడంతో, ఈ ప్రాజెక్ట్ షూట్ కొద్దిగా ఆలస్యంగా సెట్స్ పైకి రానుంది. తన పుట్టినరోజు వేడుకల అనంతరం మహేష్ వెంటనే తిరిగి వచ్చే అవకాశముంది. తిరిగివచ్చిన తరువాత, మహేష్ రాజమౌళి సినిమా కోసం నిర్వహించనున్న వర్క్‌షాప్‌లో పాల్గొననున్నారు. అయితే మహేష్ పుట్టినరోజు ఏదైనా అప్డేట్ ఇస్తారేమో అని ఫ్యాన్స్ ఎదురుచూశారు. కానీ అలాంటి హడావుడి మాత్రం కనిపించడం లేదు.

ఈ భారీ అంచనాలు ఉన్న అడ్వెంచర్ థ్రిల్లర్ చిత్రంకు KL నారాయణ నిర్మాతగా వ్యవహరించనున్నారు. ప్రస్తుతానికి ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. కానీ ఈ సినిమా భారీ వ్యయంతో రూపొందనున్నట్లు తెలుస్తుంది. ఈ ప్రాజెక్ట్‌లో నటీనటులు, సాంకేతిక నిపుణుల గురించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.

మొత్తానికి, మహేష్ బాబు తన కెరీర్‌లో ఈ కొత్త ప్రయాణం కోసం మరింత సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ అడ్వెంచర్ మూవీ అని ఇండియానా జోన్స్ తరహాలో ఉంటుందని కొన్ని హింట్స్ అయితే వచ్చాయి. రాజమౌళి ప్రత్యేకంగా ఒక ప్రెస్ మీట్ ద్వారా సినిమాపై క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే ఉంది.