Begin typing your search above and press return to search.

గుంటూరు కారం.. కృష్ణ వింటేజ్ లుక్ ను గుర్తుచేస్తోందిగా

ఇక గుంటూరు కారం పోస్టర్ లోనూ మహేష్ అదే స్టైల్ లో సిగరేట్ తాగుతూ కనిపించడంతో, ఆ రెండు ఫోటోలు వైరల్ అవతున్నాయి

By:  Tupaki Desk   |   9 Aug 2023 11:05 AM GMT
గుంటూరు కారం.. కృష్ణ వింటేజ్ లుక్ ను గుర్తుచేస్తోందిగా
X

సూపర్ స్టార్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా గుంటూరు కారం. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా, ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అయితే, ఈ రోజు మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ నుంచి ఓ పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్ లో మహేష్ మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. లుంగీ కట్టుకొని, బీడీ వెలుగించుకుంటూ చాలా మాస్ గా కనిపించాడు

అయితే, ఈ పోస్టర్ ని చూస్తే, ఫ్యాన్స్ కి మాత్రం ఓ సినిమాలోని లుక్ గుర్తుకు వస్తోంది. దీంతో, ఆ రెండింటినీ కలిపి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇంతకీ వారు పోలుస్తున్న సినిమా ఎవరిదో కాదు. మహేష్ తండ్రి కృష్ణ నటించిన కిరాయి కోటిగాడు లోనిది. కోదండరామి రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ మూవీ 1983లో విడుదలైంది. ఆ సినిమాలో కృష్ణ సరసన శ్రీదేవి హీరోయిన్ గా నటించారు.

ఈ సినిమాలో కృష్ణ తరచూ సిగరేట్ తాగుతూ ఉంటారు. ఇక గుంటూరు కారం పోస్టర్ లోనూ మహేష్ అదే స్టైల్ లో సిగరేట్ తాగుతూ కనిపించడంతో, ఆ రెండు ఫోటోలు వైరల్ అవతున్నాయి. ఆ మూవీలో కృష్ణ పేరు కోటి, ఊరు తెనాలి అంటూ డైలాగు చెబుతూ ఉంటారట. ఇక, త్రివిక్రమ్ తీస్తున్న సినిమా కూడా తెనాలి పరసర ప్రాంతాల్లో తెరకెక్కిస్తుండటం విశేషం. దీంతో, రెండింటి మధ్య ఏదో కనెక్షన్ ఉండే ఉంటుంది అని అభిమానులు చర్చించుకుంటున్నారు.

ఇక, గుంటూరు కారంలో మహేష్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. నిజానికి ఈ మూవీ ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ, చాలా కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది.

ఇక, ఈ మూవీలో డైరెక్టర్ త్రివిక్రమ్, మహేష్ తో కబడ్డీ ఆడిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కడు మూవీలో కబడ్డీ సీన్లు గుర్తుకువచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మరి, ఈ సినిమా ఎంత వరకు ఆకట్టుకుంటుందో, అసలు ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు వస్తుందో చూడాలి.