Begin typing your search above and press return to search.

రాజమౌళి కోసం.. మహేష్ లుక్ ఇదేనా?

ఈ ఫోటోల్లో మహేష్ నయా మెకోవర్ అదిరిపోయింది. లాంగ్ హెయిర్, బియర్డ్ లుక్ లో మహేష్ ని చూసిన ఫ్యాన్స్ హాలీవుడ్ హీరోలా ఉన్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   4 Feb 2024 9:57 AM GMT
రాజమౌళి కోసం.. మహేష్ లుక్ ఇదేనా?
X

సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో తెరకెక్కిన 'గుంటూరు కారం' సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మొదటిరోజే ఈ సినిమాకు కొంచెం మిక్స్‌డ్ టాక్ రావడంలో కలెక్షన్ల మీద ప్రభావం పడుతుందని ట్రేడ్ వర్గాలు భావించాయి. కానీ ఆ అంచనాలను తలకిందులు చేస్తూ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోయింది. ఇప్పటివరకు ఏకంగా రూ.250 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

దీంతో ఫ్యాన్స్ ఓ వైపు సంబరాలు చేసుకుంటుంటే మహేష్ బాబు మాత్రం రాజమౌళి సినిమా కోసం వర్క్ షాప్ స్టార్ట్ చేసాడు. ఈ క్రమంలోనే 'SSMB29' ప్రజెక్టు కోసం సరికొత్తగా మేకోవర్ అవ్వడానికి రీసెంట్ గానే జర్మనీ వెళ్ళాడు జక్కన్న పాన్ వరల్డ్‌ మూవీ ప్రీప్రొడక్షన్స్‌ వర్క్‌లో భాగంగా స్టంట్స్‌లో..యాక్షన్‌లో.. ఫారెన్లో ట్రైనింగ్ తీసుకున్నాడు మహేష్ బాబు.

రీసెంట్‌గా ట్రెక్కింగ్ చేస్తూ.. కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్న విషయం తెలిసిందే. ఇక జర్మనీ ట్రిప్ కంప్లీట్ చేసుకున్న మహేష్ బాబు తాజాగా హైదరాబాద్ తిరిగి వచ్చేసాడు. ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వస్తుండగా మహేష్ ఫోటోలు సోషల్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో మహేష్ నయా మెకోవర్ అదిరిపోయింది. లాంగ్ హెయిర్, బియర్డ్ లుక్ లో మహేష్ ని చూసిన ఫ్యాన్స్ హాలీవుడ్ హీరోలా ఉన్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు.

బహుశా ఇదే లుక్ తో రాజమౌళి సినిమాలో మహేష్ కనిపించే ఛాన్స్ ఉంది. తలకి క్యాప్, కూలింగ్ గ్లాస్ పెట్టుకొని బ్రౌన్ కలర్ జాకెట్ లో కనిపించిన మహేష్ లేటెస్ట్ స్టైలిష్ లుక్స్ ఫ్యాన్స్ లో మరింత జోష్ నింపింది. ఆఫ్రికన్ అడవుల్లో ఇండియన్ ఇండియానా జోన్స్ రేంజ్ సినిమాని మహేష్ తో రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడు.

ఇందుకోసం సుమారు 1000 కోట్లకు పైగా భారీ బడ్జెట్ ని కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది సీనియర్ నిర్మాత కె.ఎల్ నారాయణ ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ లో ఉగాది సందర్భంగా ఈ ప్రాజెక్టుని అఫీషియల్ గా లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.