Begin typing your search above and press return to search.

SSMB29: బాబు దిగిపోయాడు.. ఈ లుక్కులో కేక

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతి సినిమాలో ఒకే రకమైన లుక్ లో కనిపిస్తాడని గతంలో ఎక్కువగా వచ్చిన విమర్శలు.

By:  Tupaki Desk   |   7 July 2024 10:57 AM GMT
SSMB29: బాబు దిగిపోయాడు.. ఈ లుక్కులో కేక
X

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతి సినిమాలో ఒకే రకమైన లుక్ లో కనిపిస్తాడని గతంలో ఎక్కువగా వచ్చిన విమర్శలు. క్యారెక్టర్ ఏదైనా కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు లుక్ మాత్రం మారదని అతనిని వ్యతిరేకించే ఇతర హీరోల అభిమానులు చేసే కామెంట్స్. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు నెక్స్ట్ రాజమౌళితో పాన్ వరల్డ్ మూవీ చేయబోతున్నాడు. ఈ సినిమా కోసం మాత్రం సూపర్ స్టార్ కంప్లీట్ గా తనని తాను మార్చుకోబోతున్నాడు.

గత కొంతకాలంగా లండన్ లో ఉంటున్న సూపర్ స్టార్ మహేష్ బాబు SSMB29 సినిమాలో క్యారెక్టర్ లుక్ కోసం మేకోవర్ అవుతున్నారు. బాడీ షేప్ కూడా మారుస్తున్నాడు. ఈ సినిమాలో మహేష్ బాబు డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నారు. అందుకే క్యారెక్టర్స్ సరిపోయే విధంగా మహేష్ బాబు తన ఆహార్యం మార్చుకునే పనిలో ఉన్నారు. తాజాగా ఆయన హైదరాబాద్ తిరిగి వచ్చారు.

ఈ సందర్భంగా మీడియాలో సూపర్ స్టార్ మహేష్ బాబు వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఇందులో మహేష్ బాబు లాంగ్ హెయిర్ తో పాటు గెడ్డం, మీసకట్టుతో కనిపించాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఎప్పుడు కూడా క్లీన్ సేవ్ లో మహేష్ బాబుని అభిమానులు చూసేవారు. అయితే మొదటి సారి ఇలా గెడ్డంతో పాటు లాంగ్ హెయిర్, మీసకట్టుతో కనిపించేసరికి ఫ్యాన్స్ కొత్తగా ఫీల్ అవుతున్నారు.

SSMB29 కోసమే మహేష్ బాబు ఈ లుక్ లోకి మారుతున్నట్లు తెలుస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి చిత్రంలో వరల్డ్ అడ్వాంచర్ ట్రావెలర్ గా కనిపించనున్నాడు. ఈ నేపథ్యంలో అతని లుక్ కంప్లీట్ గా ట్రావెలర్ తరహాలో మార్చుకుంటున్నట్లు తెలుస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే ఆగష్టు 9న రాబోతోంది. ఈ పుట్టినరోజు నాడు SSMB29 సినిమా నుంచి కాన్సెప్ట్ వీడియోని రిలీజ్ చేసే ప్లానింగ్ జరుగుతుందంట.

ఇప్పటికే దీనిపై జక్కన్న వర్క్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరో వైపు మూవీ కోసం క్యాస్టింగ్ ని ఫైనల్ చేసే పనిలో ఉన్నారు. సినిమాలో ప్రతినాయకుడిగా పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపిస్తాడనే ప్రచారం నడుస్తోంది. అలాగే హాలీవుడ్ లో రాణిస్తోన్న ఇండోనేషియన్ బ్యూటీ చెల్సియాని మహేష్ బాబుకి జోడీగా తీసుకుంటున్నారని టాక్. అలాగే ఈ ఏడాది ఆఖరులో మూవీ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందనే మాట వినిపిస్తోంది.