Begin typing your search above and press return to search.

సూపర్ స్టార్ తనయుడు రెడీ అవుతున్నాడా?

ప్రస్తుతం టాలీవుడ్ లో నెక్స్ట్ జెనరేషన్ స్టార్స్ రెడీ అవుతున్నారు. ఇండస్ట్రీలో వారసత్వం అనేది ఎక్కువగా ఉంటుంది.

By:  Tupaki Desk   |   15 July 2024 4:14 AM GMT
సూపర్ స్టార్ తనయుడు రెడీ అవుతున్నాడా?
X

ప్రస్తుతం టాలీవుడ్ లో నెక్స్ట్ జెనరేషన్ స్టార్స్ రెడీ అవుతున్నారు. ఇండస్ట్రీలో వారసత్వం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇప్పుడు స్టార్ హీరోలుగా ఉన్న వారి పిల్లలు కూడా యుక్తవయస్సులోకి వచ్చి నెక్స్ట్ జెనరేషన్ టాలీవుడ్ హీరోలుగా మారడానికి సిద్ధం అవుతున్నారు. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ నుంచి నెక్స్ట్ స్టార్ హీరోలు అయ్యే వారి జాబితాలో కొంతమంది పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. నందమూరి బాలయ్య తనయుడు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు.

ఇప్పటికే యాక్టింగ్ శిక్షణ తీసుకొని పెర్ఫెక్ట్ మేకోవర్ తో హీరో మెటీరియల్ గా తనని తాను షోకేస్ చేసుకుంటున్నారు. త్వరలో అతని ఇంట్రడక్షన్ ఉండొచ్చనే మాట వినిపిస్తోంది. నెక్స్ట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ ని కూడా భవిష్యత్ పవర్ స్టార్ గా ఫ్యాన్స్ అభివర్ణిస్తున్నారు. అతను కూడా ఫిల్మ్ కి సంబందించిన ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. అయితే అకిరా నందన్ ఫోకస్ ప్రస్తుతం మ్యూజిక్ మీద ఉందని తెలుస్తోంది. భవిష్యత్తులో హీరోగా మారే ప్రయత్నం చేస్తాడేమో చూడాలి.

నెక్స్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబు తనయుడు గౌతమ్ కృష్ణ కూడా తండ్రి వారసత్వాన్ని నెక్స్ట్ లెవల్ కి తీసుకొని వెళ్లాలని డిసైడ్ అయ్యినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సుకుమార్ నేనొక్కడినే సినిమాలో చిన్నప్పటి మహేష్ బాబు క్యారెక్టర్ లో గౌతమ్ కృష్ణ నటించాడు. ఆ క్యారెక్టర్ లో మంచి పెర్ఫార్మెన్స్ చూపించి మూవీ రన్ పై గౌతమ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసాడని చెప్పొచ్చు. ఆ తరువాత ఎడ్యుకేషన్ పైన గౌతమ్ కృష్ణ పూర్తిస్థాయిలో ఫోకస్ చేసాడు.

న్యూయార్క్ లో గౌతమ్ కృష్ణ బ్యాచిలర్ డిగ్రీ చేస్తున్నాడని తెలుస్తోంది. అలాగే ప్రముఖి ఫిల్మ్ స్కూల్ లో నటనలో కూడా శిక్షణ తీసుకుంటున్నాడంట. దాంతో పాటు లుక్ పరంగా కూడా తనని తాను బెటర్ చేసుకునే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. నెక్స్ట్ జెనరేషన్ సూపర్ స్టార్ అనిపించుకునే అన్ని అర్హతలు తనకున్నాయని ప్రూవ్ చేసుకోవడానికి గౌతమ్ కృష్ణ రెడీ అవుతున్నట్లు సమాచారం. రాబోయే 5 ఏళ్లలో గౌతమ్ టాలీవుడ్ ఎంట్రీ ఉండొచ్చనే మాట వినిపిస్తోంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు చైల్డ్ యాక్టర్ గా సక్సెస్ అయిన తర్వాత చిన్న వయస్సులోనే రాజకుమారుడు సినిమాతో హీరోగా కెరియర్ స్టార్ట్ చేసాడు. తండ్రి బాటలోనే గౌతమ్ కూడా ఎర్లీ ఏజ్ లోనే హీరోగా తెరంగేట్రం చేస్తాడేమో అనేది వేచి చూడాలి. ఇదిలా ఉంటే సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం జక్కన్నతో పాన్ వరల్డ్ సినిమా కోసం సిద్ధం అవుతున్నారు. ఈ సినిమా కోసం డిఫరెంట్ లుక్ ట్రై చేస్తున్నారు. ఈ చిత్రం కంప్లీట్ అయ్యేసరికి కనీసం మూడేళ్ళ సమయం పట్టొచ్చు. ఆ లోపు గౌతమ్ యాక్టింగ్ ట్రైనింగ్ కూడా కంప్లీట్ అయిపోయే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.