Begin typing your search above and press return to search.

హాలీవుడ్ లయన్ కోసం మహేష్.. గేట్ రెడీ!

సూపర్ స్టార్ మహేష్ బాబు తన నటనతో మాత్రమే కాదు, తన వాయిస్ ఓవర్ తో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటాడని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

By:  Tupaki Desk   |   21 Aug 2024 6:58 AM GMT
హాలీవుడ్ లయన్ కోసం మహేష్.. గేట్ రెడీ!
X

సూపర్ స్టార్ మహేష్ బాబు తన నటనతో మాత్రమే కాదు, తన వాయిస్ ఓవర్ తో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటాడని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాజాగా, మహేష్ బాబు హాలీవుడ్ డిస్నీ యానిమేషన్ చిత్రం ‘ముఫాస’ కి తెలుగు వాయిస్ ఇవ్వబోతున్నారన్న వార్త అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. డిస్నీ సంస్థ రూపొందిస్తున్న ఈ చిత్రం, 'ది లయన్ కింగ్' ప్రీక్వెల్‌గా 'ముఫాస' సినిమా రానుంది. ఇక ఈ సినిమా డిసెంబర్ 20న తెలుగులో విడుదల కాబోతోంది.

మహేష్ బాబు ముఫాస పాత్రకు వాయిస్ ఇవ్వనున్నట్లు చాలా రోజులుగా అనేక రకాల వార్తలు వైరల్ అయ్యాయి. ఇక ఫైనల్ గా ఈ విషయంలో అఫీషియల్ క్లారిటీ వచ్చేసింది. తెలుగులో మహేష్ బాబు వాయిస్ ఇవ్వనున్నాడు. ఈ సినిమా ట్రైలర్ ఆగస్టు 26న తెలుగులో విడుదల కానుంది. ఇప్పటికే మహేష్ బాబు పలు తెలుగు చిత్రాలకు వాయిస్ ఓవర్ ఇచ్చి మెప్పించారు.

'జల్సా,' 'బాద్‌షా,' 'ఆచార్య' చిత్రాలకు ఆయన వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కానీ హాలీవుడ్ సినిమా కోసం డబ్బింగ్ చేయడం మాత్రం మహేష్‌కు ఇదే మొదటిసారి. ముఖ్యంగా 'ముఫాస' వంటి విభిన్న కథాంశంతో, సాంకేతికంగా అత్యున్నతంగా ఉండబోతున్న చిత్రానికి వాయిస్ ఇవ్వడం ద్వారా, మహేష్ బాబు తన డబ్బింగ్ నైపుణ్యాన్ని మరో స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.

డిస్నీ ఈ సినిమాలో మహేష్ బాబును భాగస్వామిగా తీసుకోవడం వెనుక ప్రధాన కారణం, ఆయన చిన్న పిల్లల నుంచి యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ వరకు అన్ని వర్గాల్లో ఉన్న క్రేజ్. మహేష్ బాబు వాయిస్, ఆయన మేనరిజం సినిమాకి భారీ క్రేజ్ ను తెస్తుందని అభిమానులు విశ్వసిస్తున్నారు. ముఫాస పాత్రలో మహేష్ గొంతు వినడాన్ని తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

'ముఫాస' సినిమా డిసెంబర్ 20న తెలుగు, హిందీ, తమిళం, ఇంగ్లీష్ భాషల్లో విడుదల కానుంది. ఆగస్టు 26న తెలుగులో ట్రైలర్ విడుదల కాబోతుండగా, అప్పటి నుంచి ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగే అవకాశముంది. డిస్ని స్టూడియోస్ నుంచి వస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను మహేష్ వాయిస్ ద్వారా మరో స్థాయికి తీసుకెళ్తారని, దీనితో తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా మరింత దగ్గరవుతుందని డిస్నీ సంస్థ భావిస్తోంది.