Begin typing your search above and press return to search.

ఆకాశాన్ని..న‌క్ష‌త్రాల్ని అందుకోవాలి గౌత‌మ్!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ వార‌సుడు గౌత‌మ్ పుట్టిన రోజు సంద‌ర్భంగా అభిమానులు అర్ద‌రాత్రి నుంచి సోష‌ల్ మీడియా వేదిక‌గా శుభాకాంక్ష‌ల‌తో హోరెత్తిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   31 Aug 2023 6:57 AM GMT
ఆకాశాన్ని..న‌క్ష‌త్రాల్ని అందుకోవాలి గౌత‌మ్!
X

సూప‌ర్ స్టార్ మ‌హేష్ వార‌సుడు గౌత‌మ్ పుట్టిన రోజు సంద‌ర్భంగా అభిమానులు అర్ద‌రాత్రి నుంచి సోష‌ల్ మీడియా వేదిక‌గా శుభాకాంక్ష‌ల‌తో హోరెత్తిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ముద్దుల కుమారుడికి మ‌హేష్ కూడా ట్విట‌ర్ ద్వారా విషెస్ తెలియ‌జేసారు. `హ్యాపీ 17 మై ఛాంప్. నువ్వు వేసే ప్ర‌తీ అడుగు నీ ల‌క్ష్యానికి ద‌గ్గ‌ర‌గా తీసుకెళ్లాలి. నువ్వు ఆకాశాన్ని..ఆ న‌క్ష‌త్రాన్ని అందుకోవాలి. ల‌వ్ యూ సోమ‌చ్ అని ట్వీట్ చేసారు.

ఇక త‌ల్లి న‌మ్రత కూడా విషెస్ తెలిపారు. హ్యాపీ బ‌ర్త్ డే జీజీ. ప్ర‌తీ ఏడాది మ‌మ్మ‌ల్ని గ‌ర్వ‌ప‌డేలా చేయాలి. జీవితంలో ఎంతో ఎత్తుకు ఎద‌గాలి అని కోరుకున్నాను అలాగే సితార `నువ్వే నా ఆధారం.మూలం.. నువ్వే నా ప్ర‌పంచం అన్న‌య్య. ల‌వ్ యూ సోమ‌చ్ అని రాసుకొచ్చారు. ఇక మ‌హేష్ షేర్ చేసిన గౌత‌మ్ ఫోటో చూస్తే హీరో మెటీరియ‌ల్ అని చెప్పాల్సిన ప‌నిలేదు. అమ్మ‌-నాన్న‌లాగే మంచి హైట్. 17వ ఏట‌లోకి అడుగు పెట్టాడు. ఎదిగే వ‌య‌సు. ఇంకా హైట్ అవుతాడు. 18 వ ఏట‌లోకి వ‌చ్చ‌స‌రికి రూపు రేఖ‌లు మారిపోతాయి.

పై చ‌దువుల‌కు విదేశాల‌కు వెళ్తాడు. ప్ర‌స్తుతం గౌత‌మ్ దృష్టంతా చదువుపైనే ఉంది. త‌ల్లిదండ్రులు కూడా బాగా చ‌దివించే ప్లాన్ లో ఉన్నారు. సినిమాల క‌న్నా ముందు చ‌దువు పూర్తి చేయాల‌రి భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. సినిమాల ప‌రంగా సితార‌కు కావాల్సినంత స్వేచ్ఛ ఇచ్చారు. ఆమె కూడా చాలా ఆస‌క్తిగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. అన్న‌య్య క‌న్నా ముందుగా సితార మ్యాక‌ప్ వేసుకున్నా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌నిలేదు.

2006 ఆగ‌స్టు 31న గౌత‌మ్ జ‌న్మించాడు. గౌత‌మ్ చాలా చిన్న బేబిగా పుట్టాడు. ఆ స‌మ‌యంలో కొన్ని ర‌కాల ఆరోగ్య స‌మ‌స్య‌లు ఎదుర్కున్న‌ట్లు మ‌హేష్ తెలిపారు. చివ‌రిగా అన్నింటిని దాటుకుని గౌత‌మ్ ఇంత‌టి వాడు అయ్యాడు. మ‌రి న‌టుడిగా ఎంట్రీ ఇస్తాడా? లేదా? అన్న‌ది చూడాలి.