Begin typing your search above and press return to search.

గళ్ళ లుంగీ… నోట్లో బీడీతో సూపర్ స్టార్

ఇందులో గళ్ళ లుంగీ కట్టుకొని నోట్లో బీడీ వెలిగిస్తూ కళ్ళజోడుతో కూర్చొని పక్కా మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు.

By:  Tupaki Desk   |   9 Aug 2023 4:10 AM GMT
గళ్ళ లుంగీ… నోట్లో బీడీతో సూపర్ స్టార్
X

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. త్రివిక్రమ్, మహేష్ కలయికలో వచ్చిన అతడు, ఖలేజా తరహాలో కాకుండా ఈ సారి పక్కా మాస్ మసాలా కథతో మాటల మాంత్రికుడు మాయ చేయడానికి రెడీ అయ్యారు. గుంటూరు కారం టైటిల్ తో ఈ మూవీ ప్రస్తుతం శరవేగంగా తెరకెక్కుతోంది.


వచ్చే ఏడాది సంక్రాతికి రిలీజ్ చేసే లక్ష్యంగా సినిమాని ఫినిష్ చేయడానికి త్రివిక్రమ్ సిద్ధమయ్యారు. అయితే గత ఏడాదిలోనే ఈ మూవీ ప్రారంభమైన ఫస్ట్ వెర్షన్ స్క్రిప్ట్ మహేష్ బాబుకి నచ్చకపోవడంతో దానిని హోల్డ్ చేశారు. ఇక సెకండ్ వెర్షన్ ఫైనల్ చేసుకొని మళ్ళీ కొత్తగా షూటింగ్ స్టార్ట్ చేశారు. హీరోయిన్ గా పూజా హెగ్డేని తీసేసి శ్రీలీలని పెట్టుకున్నారు. మహేష్ బాబు కెరియర్ లో మాస్ కమర్షియల్ సినిమాలు చేసిన కూడా పూర్తిగా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే కథతో మూవీ రాలేదని చెప్పొచ్చు.

ఎప్పుడో కెరియర్ ఆరంభంలో ఒకటి, రెండు సినిమాలు విలేజ్ బ్యాక్ డ్రాప్ లో చేశారు. అయితే స్టార్ అయిన తర్వాత మరల విలేజ్ టచ్ లేదు. గుంటూరు కారం సినిమాతో మరోసారి పూర్తిగా విలేజ్ బ్యాక్ డ్రాప్ లోకి వెళ్ళిపోయి మాస్ కుర్రాడిగా మారిపోయారు. యాక్షన్ అండ్ కామెడీ మిక్స్ చేసి ఈ చిత్రాన్ని ప్రేక్షకులకి అందించే ప్రయత్నం త్రివిక్రమ్ చేస్తున్నారు.

తాజా సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇందులో గళ్ళ లుంగీ కట్టుకొని నోట్లో బీడీ వెలిగిస్తూ కళ్ళజోడుతో కూర్చొని పక్కా మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఈ తరహా లుక్ లో మహేష్ బాబు కెరియర్ లో ఇప్పటి వరకు కనిపించలేదు. దీనిని బట్టి గుంటూరు కారం ఎంతఘాటుగా ఉండబోతోందో అర్ధమవుతోంది.

ఈ లుక్ ని ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. కచ్చితంగా త్రివిక్రమ్ ఈ సారి పక్కా కమర్షియల్ హిట్ సూపర్ స్టార్ కి ఇస్తాడని ఈ పోస్టర్ చూస్తున్నవారు కామెంట్స్ చేస్తున్నారు. మహేష్ బాబు అభిమానులకి కూడా పోస్టర్ లో మహేష్ స్టైల్ విపరీతంగా నచ్చేసింది. గుంటూరు బ్యాక్ డ్రాప్ లో విలేజ్ నేటివిటీలో ఈ కథని మాటల మాంత్రికుడు చెప్పబోతున్నారు. మరి ఈ సినిమాతో అతడు, ఖలేజాతో రాని సక్సెస్ వస్తుందేమో చూడాలి.