SSMB29: మహేష్ బాబు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాడంటే..
సూపర్ స్టార్ మహేష్ బాబు తన చివరి ప్రాజెక్ట్ "గుంటూరు కారం" తో పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయాడు.
By: Tupaki Desk | 22 May 2024 9:32 AM GMTసూపర్ స్టార్ మహేష్ బాబు తన చివరి ప్రాజెక్ట్ "గుంటూరు కారం" తో పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయాడు. ఇక ఆ నిరాశను అధిగమిస్తూ, కొత్త ప్రాజెక్ట్ లోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం మహేష్ రాజమౌళి SSMB29 ప్రాజెక్ట్ కోసం సిద్దమవుతున్న విషయం తెలిసిందే. చాలా కాలంగా చర్చల్లో ఉన్న ఈ ప్రాజెక్టు షూటింగ్ పనులు స్టార్ట్ కాకపోయినప్పటికి మంచి హైప్ క్రియేట్ చేస్తోంది. అఫీషియల్ లుక్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు.
ఇక మహేష్ ఇప్పటివరకు చేసిన పాత్రలు ఒక లెక్క ఇప్పుడు రాజమౌళి తో చేయబోయే ప్రాజెక్టు మరొక లెక్క అనే విదంగా ఉంది. లుక్ కోసం కఠినమైన శారీరక శిక్షణలో ఉన్న మహేష్ కు ఇది బిగ్ చాలెంజ్. యాక్షన్ చిత్రంగా ఉండబోయే ఈ సినిమాలో తన శరీరాన్ని పవర్ఫుల్ తయారు చేసేందుకు కృషి చేస్తున్నారు. ఇప్పటివరకు మహేష్ ని సన్నగా, ఫిట్ గా మాత్రమే చూసిన అభిమానులకు, ఈ సారి ఆయనని హై వోల్టేజ్ బాడీ లుక్ లో చూడబోతున్నారు.
గత చిత్రాలలో మహేష్ లుక్ పై వచ్చిన కామెంట్స్ ను దృష్టిలో ఉంచుకుని, ఈ సారి ఆయన లుక్ ని ప్రత్యేకంగా డిజైన్ చేయడానికి రాజమౌళి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రం మహేష్ బాబుకి, మరియు రాజమౌళి కి ఎంతో ప్రతిష్టాత్మకం అనే చెప్పాలి. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ పై విపరీతమైన అంచనాలు ఉన్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరీర్ లోనే బెస్ట్ లుక్ తో కనిపించబోతున్నారు.
ఈ ప్రాజెక్ట్ కోసం మహేష్ తన బాడీ ని బలంగా మార్చడం పై అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ప్రత్యేకంగా ఫిట్నెస్ ట్రైనర్ తో ఎప్పటికప్పుడు జిమ్ లో మహేష్ చెమటలు చిందిస్తున్నారు. 48 ఏళ్ళ వయసులో ఉన్న మహేష్ ఇన్నేళ్ల సినీ కెరీర్ లో ఏ పాత్ర కోసం ఇంత హార్డ్ వర్క్ చేయలేదు. ఇలాంటి ఒక రోజు వస్తుందని కూడా మహేష్ ఉహించి ఉండరు.
మహేష్ ఉన్న లుక్ కి బాడీ సెట్టవ్వదనే కామెంట్ ఉంది. ఇక ఆ కామెంట్స్ కు జక్కన్న కౌంటర్ ఇచ్చేలా మహేష్ ను సిద్ధం చేస్తున్నట్లు అనిపిస్తోంది. ఇప్పటికే మహేష్, కొన్ని వర్క్‌షాపుల్లో పాల్గొంటున్నారు. ఈ ప్రాజెక్ట్ షూటింగ్ ప్రారంభం అయ్యే ముందు పక్కా ప్రణాళికలతో వర్క్ షాప్ కూడా నిర్వహించనున్నారు. ఈ ప్రాజెక్ట్ పై వచ్చిన అనేక రూమర్లు, సోషల్ మీడియాలో హడావిడి చేయడం, అభిమానుల లో ఉన్న ఆసక్తిని మరింత పెంచుతోంది.
ఇక సినిమాను దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై KL నారాయణ నిర్మించనున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కోసమే దాదాపు 6 నెలల సమయం తీసుకోవడంతో, ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి రెండేళ్ల కంటే ఎక్కువ సమయం పట్టవచ్చని తెలుస్తోంది. అయితే, ఈ సుదీర్ఘ సమయం అంతా అభిమానులు సరికొత్త మహేష్ ని, అత్యుత్తమ రాజమౌళి దర్శకత్వం లో చూడగలరని ఆశిస్తున్నారు.