సిలికాన్ సిటీలోనూ మహేష్ బిజినెస్!
మహేష్ ఏషియన్ సునీల్ నారంగ్ తో కలిసి ఈ మాల్ ని నిర్మించిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 25 April 2024 7:09 AM GMTఅత్యాధునిక టెక్నాలజీతో రూపొందిన ఏఏంబీ సినిమాస్ హైదరాబాద్‌లోని ఉత్తమ మల్టీప్లెక్స్‌లలో ఒకటిగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఎనిమిది స్క్రీన్లతో రూపోందిన మాల్ ప్రేక్షకులకు ది బెస్ట్ ఎక్స్ పీరియన్స్ ని అందిస్తోంది. ఏఏంబీ మాల్ వ్యవహారాలన్నింటిని నమ్రతశిర్కదోర్ చూసుకుంటున్నారు. మహేష్ ఏషియన్ సునీల్ నారంగ్ తో కలిసి ఈ మాల్ ని నిర్మించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్ లోనే మరో ఏఏంబీ ముస్తాబవుతోంది.
ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ఏడు స్క్రీన్‌ల మల్టీప్లెక్స్‌ను నిర్మిస్తున్నారు. సుదర్శన్ థియేటర్ స్థానంలో ఈ మల్టీప్లెక్స్ ఏర్పాటు అవుతుంది. దానికి సంబంధించిన పనులు చకచకా జరుగుతున్నాయి. తాజాగా మాల్ విస్తరణలో బాగంగా బెంగుళూరులో సైతం ఏఏంబీ రెడీ అవుతోంది. నిన్నటి రోజున పూజా కార్యక్రమాలు కూడా జరిగినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అక్కడ భారీ మాల్ నిర్మించడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. అక్కడి ప్రేక్షకులకు అన్ని రకాల సౌకర్యాలతో అడ్వాన్స్ డు టెక్నాలజీతో కోట్ల రూపాయాలు వెచ్చించి నిర్మిస్తున్నారు.
అయితే నిర్మాణానికి..ప్రారంభోత్సవానికి సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. నిన్ననే పూజా కార్యక్రమాలు మొదలు పెట్టారు కాబట్టి సమయం పడుతుంది. దీన్ని బట్టి చెన్నై..ముంబై ..విశాఖ పట్టణం లాంటి మహానగరాల్లో కూడా ఏఎంబీ నిర్మించే అవకాశం ఉంది. అన్ని ఒకేసారి కాకుండా ఒకటి పూర్తయిన తర్వాత మరోటి మొదలు పెడుతున్నారు. ప్రేక్షకులు..జనాభా విస్తరణని బట్టి మాల్స్ నిర్మాణం చేపడుతున్నారు.
ఇక ఇదే బిజినెస్ లో ఏషియన్ సినిమాస్ తో కలిసి అల్లు అర్జున్, రవితేజ, విజయ్ దేవరకొండ మాల్స్ నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. మాల్ కం థియేటర్ ఏర్పాటు కావడంతో ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తుంది. అయితే మరోవైపు పీవీఆర్ దేశ వ్యాప్తంగా ఇటీవలే కొన్ని స్క్రీన్లను మూసేసిన సంగతి తెలిసిందే.