Begin typing your search above and press return to search.

నీట్ ర్యాంక‌ర్ ని డాక్ట‌ర్ చేస్తోన్న‌ సితార!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ స్థాపించిన మ‌హేష్ పౌండేష‌న్ ద్వారా ఎన్నో సేవాకార్య‌క్రమాలు జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   22 July 2024 5:30 AM GMT
నీట్ ర్యాంక‌ర్ ని డాక్ట‌ర్ చేస్తోన్న‌ సితార!
X

సూప‌ర్ స్టార్ మ‌హేష్ స్థాపించిన మ‌హేష్ పౌండేష‌న్ ద్వారా ఎన్నో సేవాకార్య‌క్రమాలు జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా చిన్నారుల‌కు గుండె శ‌స్త్ర చికిత్స‌ల విష‌యంలో మ‌హేష్ ఎంతో దృష్టి పెట్టి ప‌ని చేస్తున్నారు. అలాగే సూప‌ర్ స్టార్ కృష్ణ ఎడ్యుకేష‌న‌ల్ ఫండ్ ద్వారా ఎంతో మందితెలివైన విద్యార్దుల‌కు సేవ‌లు అందుతున్నాయి. ఇప్పుడు తాత‌య్య‌..తండ్రి వార‌స‌త్వాన్ని పుణికి పుచ్చుకుని సితార ఘ‌ట్ట‌మ‌నేని కూడా అదే పంథాలో వెళ్తోన్న సంగ‌తి తెలిసిందే.

సితార తొలి సంపాద‌న చారిటీకి ఇచ్చేసింది. ఓ బంగారం దుకాణం యాడ్ ద్వారా వ‌చ్చిన డ‌బ్బును అవ్వ‌తాత‌ల‌కు ఖ‌ర్చు చేసింది. తాజాగా నీట్ ర్యాంక‌ర్ ని డాక్ట‌ర్ ని చేసే బాద్య‌త సైతం సితార తీసుకుని షెభాష్ అనిపించింది. 2024 లో జ‌రిగిన నీట్ పరీక్ష‌లో న‌వ్య 600ల‌కు పైగా స్కోర్ చేసింది. సాధార‌ణ కాలేజీలో చ‌ద‌వి ప్ర‌భుత్వ మెడిక‌ల్ కాలేజీలో డాక్ట‌ర్ సీట్ సంపాదించింది. కానీ పుస్త‌కాలు, హాస్ట‌ల్, కాలేజీ ఫీజులు చెల్లించ‌లేని ప‌రిస్థితి.

దీంతో నవ్య మ‌హేష్‌-కృష్ణ ట్ర‌స్ట్ని సంప్ర‌దించింది. ఆమె డాక్ట‌ర్ క‌ల‌ను సితార ఊపిరిపోసింది. న‌వ్య డాక్ట‌ర్ అయ్యేంత‌వర‌కూ చ‌దివిస్తాన‌ని భ‌రోసా క‌ల్పించింది. త‌క్ష‌ణ స‌హాయం కింద 125000 రూపాయ‌లు అందించింది. అలాగే ల్యాప్ టాప్, స్టెత‌స్ స్కోప్ అందించింది. అలాగే సితార త‌న పుట్టిన రోజు వేడుక‌లు కూడా న‌వ్య‌తో సెల‌బ్రేట్ చేసుకుంది. ఇరువురు ఒక‌రికొక‌రు కేక్ తినిపించుకున్నారు.

ఈ సంద‌ర్భంగా న‌వ్య ఎంతో సంతోష ప‌డింది. డాక్ట‌ర్ కావాలి అన్న త‌న కోరిక నీట్ ర్యాంక్ తోనే ప‌రిమి త‌మైపోతుంద‌ని బెంగ ప‌డింది. కానీ సితార రూపంలో స‌హాయం దొర‌క‌డంతో త‌న డ్రీమ్ కి చేరువ‌లో ఉంది. దీంతో సితార‌పై నెట్టింట నెటి జ‌నులు ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు. స‌హాయం చేయ‌డంలో తండ్రి, తాత‌య్య‌ల‌నే మించిపోయేలా ఉందంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు.