Begin typing your search above and press return to search.

గౌత‌మ్ అఛీవ్‌మెంట్‌పై మ‌హేష్ ఎమోష‌న‌ల్!

గౌతమ్ గ్రాడ్యుయేషన్ వేడుక లోని ఒక ఫోటోలో మహేష్ గౌతమ్‌తో పోజులిచ్చారు.

By:  Tupaki Desk   |   27 May 2024 8:36 AM GMT
గౌత‌మ్ అఛీవ్‌మెంట్‌పై మ‌హేష్ ఎమోష‌న‌ల్!
X

సూపర్ స్టార్ మహేష్ బాబు హ్యాపీ ఫ్యామిలీ మ్యాన్. సినిమాలే కాకుండా తన కుటుంబానికి పూర్తిగా అంకితమై.. తీరిక వేళ‌ల్లో వారితో గడపడానికి ఇష్టపడతాడు. తన కుమారుడు గౌతమ్ ఘట్టమనేని గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడంతో తన గర్వాన్ని ఆనందాన్ని అభిమానుల‌తో సోష‌ల్ మీడియాల్లో షేర్ చేసుకున్నారు. గ్రాడ్యుయేషన్ వేడుక నుండి ఒక ఫోటోతో పాటు హార్ట్ ట‌చింగ్ పోస్ట్‌ని మ‌హేష్ షేర్ చేసారు. గౌతమ్ భవిష్యత్తు ప్రయత్నాల విష‌యంలో మహేష్ తన ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు. గౌతమ్ గ్రాడ్యుయేషన్ వేడుక లోని ఒక ఫోటోలో మహేష్ గౌతమ్‌తో పోజులిచ్చారు.

గౌతమ్‌కు శుభాకాంక్షలు తెలిపిన‌ మహేష్ అతడి జీవితంలోని తదుపరి అధ్యాయాన్ని స్వీకరించమని .. కలలను సాధించుకునేందుకు విశ్వాసంతో ముందుకు వెళ్లాల‌ని ప్రోత్సహించారు. పుత్రునికి బేషరతుగా ప్రేమ మద్దతును అందిస్తున్నాన‌ని హామీ ఇచ్చారు. ``నా హృదయం గర్వంతో ఉప్పొంగుతోంది! నీ గ్రాడ్యుయేషన్‌కు అభినందనలు, కుమారుడా! ఈ తదుపరి అధ్యాయం మీది.. నీవు గతంలో కంటే అద్భుతంగా వెలుగొందుతార‌ని నాకు తెలుసు. నీ కలలను వెంటాడుతూ ఉండండి.. గుర్తుంచుకో.. ఎల్లప్పుడూ మానుంచి ప్రేమను అందుకుంటావు! నేను ఈరోజు గర్వించదగిన తండ్రిని..``అని సూపర్ స్టార్ ఇన్‌స్టాగ్రామ్‌లో రాశారు.

తల్లి నమ్రత కూడా ఈ సందర్భంగా తన ఆనందాన్ని షేర్ చేసారు. ఇన్‌స్టాలో ఇలా రాసారు. ``నా ప్రియమైన GG, నీవు జీవితంలో ఒక కొత్త అధ్యాయంలో అడుగుపెట్టిన‌ప్పుడు.... నేను నీ గురించి ఎంత గర్వపడుతున్నానో నువ్వు తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. నీ అభిరుచులను అనుసరించు..ఎప్పటికీ నేను నిన్ను ఎంతగానో విశ్వసిస్తాను ఈ బిగ్ డే రోజున నీకు నా ప్రేమ మద్దతు ఉంటుంది.. నిన్ను చాలా ప్రేమిస్తున్నాను`` అని ఎమోష‌న‌ల్ నోట్ రాసారు.


కెరీర్ ప‌రంగా చూస్తే... SS రాజమౌళి దర్శకత్వంలో SSMB29 కోసం మహేష్ సిద్ధమవుతున్నారు. ఈ సినిమా గ్రాండ్ జంగిల్ అడ్వెంచర్ క‌థాంశంతో తెర‌కెక్క‌నుంది. మహేష్ తీవ్రమైన శారీరక శిక్షణతో మేకోవ‌ర్ ని ప్ర‌ద‌ర్శిస్తున్నారు. అవ‌స‌రం మేర‌ వర్క్‌షాప్‌లు తీసుకుంటున్నారు. ఇందులో మ‌హేష్ పాత్ర రామాయణ ఇతిహాసం నుండి హనుమంతుని నుండి ప్రేరణ పొందిన‌ది అని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.