మహేష్ కి ఇలాంటి అనుభం ఇదే తొలిసారి!
మహేష్ కెరీర్ లో ఇప్పటివరకూ ఎన్నో జయాపజయాలున్నాయి. అన్నింటిని దాటుకునే నేడు సూపర్ స్టార్ గా నీరాజనాలు అందుకుంటున్నారు.
By: Tupaki Desk | 13 Feb 2024 12:30 PM GMTసినిమా ప్లాప్ అయితే సూపర్ స్టార్ మహేష్ రిజర్వ్ డ్ గా ఉంటారని..వారం రోజుల పాటు ఇంట్లో కుటుంబ సభ్యులతో తప్ప! ఇంకెవరితోనూ ఇంటరాక్ట్ కారని చాలా సందర్భాల్లో తెరపైకి వచ్చింది. కోట్లు ఖర్చు పెట్టి చేసిన సినిమా పోతే ఆ మాత్రం పెయిన్ ఎవరికైనా ఉంటుందని మహేష్ సైతం ఓపెన్ అయిన సందర్భా లున్నాయి. మహేష్ కెరీర్ లో ఇప్పటివరకూ ఎన్నో జయాపజయాలున్నాయి. అన్నింటిని దాటుకునే నేడు సూపర్ స్టార్ గా నీరాజనాలు అందుకుంటున్నారు.
అయితే ఇలాంటి పరిస్థితి మాత్రం ఇప్పటివరకూ మహేష్ ఎదుర్కుంది లేదనే చెప్పాలి. సంక్రాంతి కానుకుగా ఆయన నటించిన 'గుంటూరు కారం'తో తొలి రోజు ఎలాంటి టాక్ తెచ్చుకుందో తెలిసిందే. సినిమా అట్లర్ ప్లాప్ అని.. 'అత్తారింటికి దారేది -2' అని..'అజ్ఞాతవాసి' అని ఇలా విమర్శలే తెరపైకి వచ్చాయి. తొలి ఆట తోనే డిజాస్టర్ టాక్ ని మూటగట్టుకుంది. చివరికి ఈ సినిమాపై చిత్ర నిర్మాత సీన్ లోకి వచ్చి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
ఆ తర్వాత క్రమంగా 'గుంటూరు కారం' ఆడియన్స్ కి రీచ్ అయిన సన్నివేశం కనిపించింది. రెండు రోజుల తర్వాత సినిమాకి పాజిటివ్ టాక్ మొదలైంది. దీంతో నెమ్మదిగా సినిమా చాలా చోట్ల బ్రేక్ ఈవెన్ అయిందని..మరికొన్ని చోట్ల మాత్రం బ్రేక్ ఈవెన్ కాలేదని కూడా ప్రచారంలోకి వచ్చింది. దీంతో చిత్ర నిర్మాత కూడా సీన్ లోకి రావాల్సి వచ్చింది. సినిమా గురించి..మహేష్ పాత్ర గురించి ముందుగా హిట్ ఇవ్వకపోవడం..కంటెంట్ ఇలాంటిదని ప్రచారం చేయకపోవడం వల్ల జరిగిన తప్పిందం తప్ప సినిమాకి మంచి వసూళ్లు వస్తున్నాయని చెప్పుకొచ్చారు.
ఆ తర్వాత మహేష్ ఇదే సినిమా సక్సెస్ మీట్ లో సైతం పాల్గొనడం జరిగింది. మహష్ సినిమా గురించి ఇలా రెండు రకాల టాక్ లు రావడం... నిర్మాత వివరణ ఇవ్వడం అన్నది అతని కెరీర్ లో ఇంతవరకూ ఏ సినిమాకి చోటు చేసుకోలేదు. తొలిసారి 'గుంటూరు కారం' తోనే ఆ రకమైన అనుభవాన్ని మహేష్ ఎదుర్కోవాల్సి వచ్చింది. పాన్ ఇండియా లాంచింగ్ కి ముందు మహేష్ కి ఇదోక వైవిథ్యమైన అనుభవ మనే చెప్పాలి.