మహేష్ కూడా నాటు నాటుకి రెడీ..!
సూపర్ స్టార్ మహేష్, దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో వస్తున్న ఈ సినిమాకు తారాస్థాయిలో అంచనాలు ఉన్నాయి.
By: Tupaki Desk | 19 Jan 2024 2:56 AM GMTసినిమా పర్ఫెక్ట్ గా రావడంలో స్టార్స్ ఎంత గురితో ఉంటారో తెలిసిందే. వందల కోట్ల కొద్దీ బడ్జెట్ తో భారీ అంచనాలతో స్టార్స్ చేసే సినిమాల మీద చాలామంది జీవితాలు ఆధారపడి ఉంటాయి. ఇక స్టార్ హీరో.. స్టార్ డైరెక్టర్ కాంబినేషన్ అంటే ఆ అంచనాలు నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. అలాంటి అంచనాలతో వస్తున్న సినిమానే మహేష్ 29. సూపర్ స్టార్ మహేష్, దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో వస్తున్న ఈ సినిమాకు తారాస్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కోసం మహేష్ తనను తాను సిద్ధం చేసుకున్నాడని తెలుస్తుంది.
ముఖ్యంగా మహేష్ నటనకు వంకలు పెట్టడం కష్టం కానీ డ్యాన్స్ విషయంలో బాబోయ్ అనిపిస్తాడు. మహేష్ డ్యాన్స్ చేయడు చేయలేడు అనుకున్న వారికి గుంటూరు కారం తో షాక్ ఇచ్చాడు. తెర మీద మనం చూస్తుంది మహేష్ బాబేనా అనే రేంజ్ లో డ్యాన్స్ వేశాడు. ఇదంతా ఎందుకు అని ఆలోచిస్తే దీని వెనుక రీజన్ రాజమౌళి సినిమా అని తెలుస్తుంది. రాజమౌళితో సినిమా అంటే హీరో అన్నిట్లో పర్ఫెక్ట్ గా ఉండాలి.
ముఖ్యంగా సాంగ్స్ తో కూడా ఆస్కార్ గెలిచే అవకాశం ఉందని RRR నాటు నాటు సాంగ్ తో ప్రూవ్ చేశాడు జక్కన్న. అందుకే మహేష్ సినిమాలో కూడా అలాంటి స్కోప్ ఉంటే తను రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సి ఉంటుంది. అందుకే ఇన్నాళ్లు తన వల్ల కాదనుకున్న డ్యాన్సుల్లో కూడా మహేష్ దూకుడు చూపిస్తున్నాడు. మహేష్ కూడా ఇప్పుడు నాటు నాటు డ్యాన్స్ కి అదే రాజమౌళి వేయించే నాటు డ్యాన్స్ కి సిద్ధం అయినట్టే లెక్క.
సినిమాకు హీరోలు ఎంత కమిటెడ్ గా పనిచేస్తారన్నది వారి కష్టం చూస్తే అర్ధమవుతుంది. ఏదో మేకింగ్ వీడియోలో నవ్వుతూ కనిపిస్తారు తప్ప వెనక చెమట చిందించే సందర్భాలు ఎన్నో ఉంటాయి. అయితే ఎంత చేసినా ఎలా చేసినా ఫైనల్ గా ఆడియన్స్ ని మెప్పించడమే తమ లక్ష్యమని భావిస్తారు. రాజమౌళి మహేష్ కాంబో సినిమా మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ఒకటని చెప్పొచ్చు. ఈ సినిమా కోసం మహేష్ తనని తాను పూర్తిగా సిద్ధం చేసుకున్నాడు. ఇక రాజమౌళి రెడీ అంటే మహేష్ రంగంలోకి దూకడమే అని చెప్పొచ్చు. ఆర్.ఆర్.ఆర్ తర్వాత చేస్తున్న రాజమౌళి సినిమాగా మహేష్ 29వ సినిమాపై ఇంటర్నేషనల్ లెవెల్ లో హైప్ ఉంటుంది. వాటికి ఏమాత్రం తగ్గకుండా సినిమా తెరకెక్కించడం కోసం జక్కన్న భారీ ప్లాన్ లో ఉన్నాడని తెలుస్తుంది.