Begin typing your search above and press return to search.

ఆ సంచ‌ల‌నం గురించి జ‌క్క‌న్న ఏమ‌నుకుటున్నారో?

ప్ర‌స్తుతం సూప‌ర్ స్టార్ మ‌హేష్ తో ఆఫ్రిక‌న్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచ‌ర్ థ్రిల్ల‌ర్ తెర‌కెక్కించే ప‌నిలో ఉన్నారు.

By:  Tupaki Desk   |   24 Aug 2024 4:00 AM GMT
ఆ సంచ‌ల‌నం గురించి జ‌క్క‌న్న ఏమ‌నుకుటున్నారో?
X

ఇండియ‌న్ గ్రేట్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి రేంజ్ నేడు పాన్ ఇండియాని దాటి పాన్ వ‌ర‌ల్డ్ కే తాకింది. 'ఆర్ ఆర్ ఆర్' తో జ‌క్క‌న్న స్థాయి అంత‌కంత‌కు రెట్టింపు అయింది. దీంతో రాజ‌మౌళి త‌న స్థాయిని పాన్ వ‌ర‌ల్డ్ లో అంత‌కంత‌కు పెంచుకునే క‌థ‌ల్నే ఎంచుకుంటున్నారు. ప్ర‌స్తుతం సూప‌ర్ స్టార్ మ‌హేష్ తో ఆఫ్రిక‌న్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచ‌ర్ థ్రిల్ల‌ర్ తెర‌కెక్కించే ప‌నిలో ఉన్నారు. ప్ర‌స్తుతానికి జ‌క్క‌న్న మైండ్ లో ఉన్న‌ది ఈ ప్రాజెక్ట్ ఒక్క‌టే.

ఇది పూర్త‌య్యే వ‌ర‌కూ మ‌రో ఆలోచ‌న లేకుండా ప‌నిచేస్తారు. బ్యాకెండ్ లో విజ‌యేంద్ర ప్ర‌సాద్ ప్యూచ‌ర్ స్టోరీల‌ను ఎలాగూ సిద్దం చేసి పెడ‌తారు. వాటి గురించి జ‌క్క‌న్న ఆలోచ‌న చేయాల్సిన ప‌నిలేదు. ఆయ‌న రాయ‌డం..ఈయ‌న తీయ‌డం అన్న‌ట్లు జ‌ర్నీ సాగుతుంది. ఈ నేప‌థ్యంలో నేచుర‌ల్ స్టార్ నాని `ఈగ‌-2`పై చాలా కాన్పిడెంట్ గా క‌నిపిస్తున్నారు. ఇద్ద‌రి కాంబినేష‌న్ లో వ‌చ్చిన ఈగ అప్ప‌ట్లో ఎలాంటి సంచ‌ల‌న మైందో తెలిసిందే.

రాజ‌మౌళిని టెక్నిక‌ల్ గా ప్ర‌పంచానికి చాటి చెప్పిన తొలి సినిమా అదే. రిలీజ్ అనంత‌రం ఎన్నో అంత‌ర్జా తీయ వేదిక‌ల‌పై మెరిసింది. మరెన్నో అవార్డులు..రివార్డులు ద‌క్కించుకుంది. అందుకే నాని సైతం `ఈగ‌-2` పై అంత కాన్పిడెంట్ గా ఉన్నాడు. ఒక‌వేళ ఈగ కి పార్ట్ -2 తీస్తే అది నెక్స్ట్ లెవ‌ల్లోనే ఉంటుంది. అది నానితోనే తీసే అవ‌కాశం ఉంటుంది. మ‌రి ఇది ఎప్పుడు సాధ్య‌మ‌వుతుంద‌న్న‌ది? మాత్రం ఇప్ప‌ట్లో తేల్చ‌లేని పంచాయ‌తీ. ప్ర‌స్తుతానికి రాజ‌మౌళి అండ్ కో మాత్రం మ‌హేష్ సినిమా ప‌నుల్లోనే ఉంది.

నాని తాను చేయాల్సిన సినిమా ప‌నుల్లోనూ బిజీగా ఉన్నాడు. త్వ‌ర‌లో స‌రిపోదా శ‌నివారంతో ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డానికి రెడీ అవుతున్నాడు. అలాగే శ్రీకాంత్ ఓదెల‌తో కొత్త ప్రాజెక్ట్ ని ప‌ట్టాలెక్కించ‌డానికి సంసిద్ద‌మ‌వుతున్నాడు. మ‌రోవైపు కొంత మంది మేక‌ర్స్ ని లైన్ లో పెట్టాడు.