పిక్ టాక్ : 18 వెనక్కి వెళ్లిన మహేష్ ఫ్యాన్స్
సూపర్ స్టార్ మహేష్ బాబు ఎప్పటికప్పుడు తన లుక్ తో ఫ్యాన్స్ ని మరియు ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేస్తూనే ఉన్నాడు.
By: Tupaki Desk | 2 April 2024 10:07 AM GMTసూపర్ స్టార్ మహేష్ బాబు ఎప్పటికప్పుడు తన లుక్ తో ఫ్యాన్స్ ని మరియు ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేస్తూనే ఉన్నాడు. తాజాగా మహేష్ బాబు వైట్ అండ్ వైట్ డ్రెస్ ఫోటో షూట్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఈ మధ్య కాలంలో మహేష్ బాబును ఇంత కూల్ లుక్ లో చూడలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నెట్టింట వైరల్ అవుతున్న ఈ ఫోటోలు ఆయన ఫ్యాన్స్ ను 18 ఏళ్లు వెనక్కి తీసుకు వెళ్తున్నాయి. మహేష్ బాబు సైనికుడు సినిమాలో ఇలా వైట్ అండ్ వైట్ యూనిక్ డ్రెస్ లో కనిపించాడు. మళ్లీ ఇన్నాళ్లకు వైట్ అండ్ వైట్ లో మెరిశాడు.
సైనికుడు సినిమా ఫలితం విషయం పక్కన పెడితే అందులో మహేష్ బాబు లుక్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఆ రోజుల్లో మహేష్ బాబు కుర్రకారుకే కాకుండా పెద్ద వారికి కూడా మోస్ట్ వాంటెడ్ అండ్ ఫేవరెట్ హీరో అన్నట్లుగా పేరు దక్కించుకున్నాడు.
ఈ ఫోటోలు చూస్తూ ఉంటే మళ్లీ ఆ రోజులు గుర్తుకు వస్తున్నాయి అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మహేష్ బాబు ను త్వరలో రాజమౌళి డైరెక్ట్ చేయబోతున్న విషయం తెల్సిందే. ఆ సినిమాలో ఇదే లుక్ ను మెయింటెన్ చేస్తే బాగుంటుందని చాలా మంది రాజమౌళికి సూచిస్తున్నారు.
మహేష్ బాబు ఒక యాడ్ షూట్ సందర్భంగా ఇలా వైట్ అండ్ వైట్ లో ఫోటోలకు ఫోజ్ ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించాడు. పాన్ వలర్డ్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మహేష్ బాబు ముందస్తు లుక్ ఓ హాలీవుడ్ హీరో రేంజ్ లో ఉంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.