భార్యకు మహేష్ బట్టలు కొనడట.. ఎందుకంటే..
వివరాళ్లోకి వెళితే.. సిల్వర్ స్ర్రీన్‌పై నటీనటులుగా సందడి చేసి, ఆ తర్వాత వివాహ బంధంతో ఒక్కటైన వారిలో మహేశ్‌బాబు - నమ్రత శిరోద్కర్ జోడీ ఒకటి
By: Tupaki Desk | 16 Oct 2023 9:56 AM GMTసూపర్ స్టార్ మహేశ్ బాబు.. నమ్రత కోసం ఎప్పుడైన బట్టలు కొన్నారా? నమ్రత ధరించే డ్రెస్సింగ్ వెనక మహేశ్ సెలక్షన్ ఉంటుందా? అంటే దానికి తాజాగా సమాధానం చెప్పారు మహేశ్. ప్రస్తుతం సూపర్ స్టార్ చెప్పిన ఆ ఇంట్రెస్టింగ్ ఆన్సర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
వివరాళ్లోకి వెళితే.. సిల్వర్ స్ర్రీన్‌పై నటీనటులుగా సందడి చేసి, ఆ తర్వాత వివాహ బంధంతో ఒక్కటైన వారిలో మహేశ్‌బాబు - నమ్రత శిరోద్కర్ జోడీ ఒకటి. టాలీవుడ్ క్యూట్ కపుల్‌గా ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. ఎంతో అన్యోన్యంగా కలిసి ఉంటారు. అయితే వీరిద్దరి కలిసి ఒకేసారి మీడియా ముందుకు రావడం, బయట సంబంధించిన ఒకే ఈవెంట్లలో కనిపించడం చాలా అరుదుగా జరుగుతుంటుంది.
తాజాగా ఈ ఇద్దరు కలిసి ఓ డిజైనర్ షార్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సందడి చేశారు. జూబిలీ హిల్స్‌లోని తమ స్నేహితుల డిజైనర్ షాప్ ఓపెన్ చెయ్యడానికి ఇద్దరూ కలిసి వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నమ్రతకు.. ఎప్పుడైనా మీరు ఏమైనా బట్టలు కొన్నారా అని ఓ విలేకరి అడగగా.. మహేశ్ బాబు ఇంట్రెస్టింగ్ ఆన్సర్ చెప్పారు. "లేదు, నేను ఎప్పుడూ కొనలేదు. ఎందుకంటే నాకు అంతగా సెలక్షన్ రాదు. ఇంకా చెప్పాలంటే, నా బట్టలు కూడా నమ్రతనే షాపింగ్ చేస్తుంది. అన్నీ తనే చేస్తుంది" అని చెప్పారు మహేశ్ బాబు.
ఇకపోతే కేవలం తన స్నేహితుల కోసం తాను ఈ షాపు ఓపెనింగ్ వచ్చానని, ఇది తన బ్రాండింగ్‌లో పార్టు కాదని తెలిపారు మహేశ్. తాను నటిస్తున్న సినిమాల గురించి అప్డేట్స్ తర్వాత చెబుతానని అన్నారు. ప్రస్తుతం మహేశ్ బాబు 'గుంటూరు కారం' షూటింగ్‌తో బిజీగా గడుపుతున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానుంది.
ఈ సినిమాతో మహేశ్.. దర్శకధీరుడు రాజమౌళితోనూ ఓ సినిమా చేస్తున్నారు. వచ్చే ఏడాది ఇది సెట్స్‌పైకి వెళ్లనుంది. అడ్వేంచర్ డ్రామాగా ఇది రూపుదిద్దుకుంటోంది.