సినిమా ఫ్లాప్ అయితే మహేష్ రియాక్షన్ ఇలా ఉంటుందట!
నేను నటించిన సినిమాలు ప్రేక్షకాదణ పొందకపోయినా, ప్రేక్షకుల ఎక్స్‌పెక్టేషన్స్‌కు రీచ్ కాలేకపోయినా నిరుత్సాహ పడతాను. ఎందుకంటే ఒక సినిమాపై ఎన్నో అంచనాలుంటాయి.
By: Tupaki Desk | 17 Oct 2023 11:48 AM GMTసూపర్ స్టార్ మహేష్ బాబు చాలా వరకు వ్యక్తిగత విషయాల్లో రిజర్వ్‌డ్‌గా ఉంటుంటారు. కెరీర్‌కి సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలని మీడియా ముఖంగా వెల్లడించడానికి పెద్దగా ఆసక్తిని చూపించరు. అయితే తాజాగా మాత్రం మహేష్ వ్యక్తిగత విషయాల్ని వెల్లడించి షాక్ ఇచ్చారు. హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో భార్య నమ్రతతో కలిసి పాల్గొన్న మహేష్ బాబు స్టార్ అయితే ఒత్తడిని అంగీకరించాల్సిందేనని తెలిపారు. ఈ సందర్భంగా తన తండ్రి కృష్ణను గుర్తు చేసుకున్నారు.
'నేను నటించిన సినిమాలు ప్రేక్షకాదణ పొందకపోయినా, ప్రేక్షకుల ఎక్స్‌పెక్టేషన్స్‌కు రీచ్ కాలేకపోయినా నిరుత్సాహ పడతాను. ఎందుకంటే ఒక సినిమాపై ఎన్నో అంచనాలుంటాయి. వాటిని అందుకోవడానికి దాని వెనుక ఎంతో మంది కష్టం ఉంటుంది. అయితే దాని పూర్తి బాధ్యత నేను తీసుకుంటాను. దాంతో తరువాత సినిమా కోసం ఎక్కువగా శ్రమిస్తాను. ఎక్కువ దృష్టి పెడతాను. మనం స్టార్ హీరో అయినప్పుడు ఒత్తిడిని అంగీకరించాలి.
ఈ విషయం నేను మా నాన్న దగ్గరి నుంచి నేర్చుకున్నాను. ఇలాంటి ఎన్నో విషయాలు ఆయన చెప్పేవారు. క్రమశిక్షణ, వినయం, వంటి వాటి ప్రాముఖ్యతను ఆయనే నేర్పించారు. విజయం ఒక్కసారిగా రాదని, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటే గానీ వరిస్తుందని చెప్పారు' అని తెలిపారు. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు 'గుంటూరు కారం'లో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. శ్రీలీల, మీనాక్షీ చౌదరి హీరోయిన్‌లుగా నటిస్తున్నారు.
అతడు, ఖలేజా వంటి సినిమాల తరువాత మహేష్, త్రివిక్రమ్‌ల కలయికలో రూపొందుతున్న సినిమా కావడంతో 'గుంటూరు కారం'పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అంతే కాకుండా ఈ సినిమాకు సంబంధించిన ప్రతి ఆప్ డేట్ నెట్టింట వైరల్ అవుతుండటంతో ఈ ప్రాజెక్ట్ చుట్టూ ఏం జరుగుతోందనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది. కాగా భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమాని 2024, జనవరి 12న భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు.