Begin typing your search above and press return to search.

మ‌హేష్‌-రాజ‌మౌళి స్టోరీ రెడీ!

స్టోరీ విష‌యంలో త‌ల్లిదండ్రులిద్ద‌రు ఎక్క‌డా రాజీ పడ‌కుండా ప‌నిచేస్తున్నారు.

By:  Tupaki Desk   |   19 Jan 2024 12:51 PM GMT
మ‌హేష్‌-రాజ‌మౌళి స్టోరీ రెడీ!
X

సూప‌ర్ స్టార్ మ‌హేష్ క‌థానాయ‌కుడిగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో పాన్ ఇండియా సినిమాకి రంగం సిద్ద‌మ‌వు తోన్న సంగ‌తి తెలిసిందే. గ్లోబ్ ట్రాటింగ్ యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ థ్రిల్ల‌ర్ గా చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. కొన్నాళ్ల‌గా స్టార్ రైట‌ర్ విజ‌యేంద్ర ప్ర‌సాద్ ఈ సినిమా స్టోరీ ప‌నుల్లోనే బిజీ బిజీగా ఉన్నారు. బాహుబ‌లి..ఆర్ ఆర్ ఆర్ చిత్రాల్ని మించి ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాల్సిన ఆవ‌శ్య‌క‌త ఉండ‌టంతో విజ‌యేంద్ర ప్ర‌సాద్-రాజ‌మౌ ళి అండ్ కో అంతే ధీటుగా శ్ర‌మించి ప‌నిచేస్తున్నారు.

స్టోరీ విష‌యంలో త‌ల్లిదండ్రులిద్ద‌రు ఎక్క‌డా రాజీ పడ‌కుండా ప‌నిచేస్తున్నారు. ఇద్ద‌రి ఐడియాల్ని-విజువ లైజేష‌న్ చేసుకుని సిద్దం చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ని విజయేంద్ర ప్ర‌సాద్ అందించారు. ఓ ఇంట‌ర్వ్యూలో విజ‌యేంద్ర ప్ర‌సాద్ ..మ‌హేష్ సినిమా స్క్రిప్ట్ ప‌నులు పూర్త‌యిన‌ట్లు తెలిపారు. ప్ర‌స్తుతం మ‌రో క‌థ సిద్దం చేస్తున్న‌ట్లు తెలిపారు. బాలీవుడ్ న‌టుడు అజ‌య్ దేవ‌గణ్ కోసం ప్ర‌త్యేకంగా ఓ క‌థ‌ని రాస్తున్న‌ట్లు వెల్ల‌డించారు.

ఇది పిజీ దీవుల నేప‌థ్యంలో సాగే అంద‌మైన ప్రేమ క‌థ అని అన్నారు. దేశ పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు ఫిజీ ప్రభుత్వంతో కలిసి ఆయన ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. ఆ సంగ‌తి ప‌క్క‌న‌బెడితే మ‌హేష్ ప్రాజెక్ట్ కి సంబంధించి అస‌లు విషయం రివీల్ చేయ‌డంతో ఓ ప‌ని పూర్త‌యిన‌ట్లు తెలుస్తోంది. స్టోరీ సిద్ద‌మైన నేప‌థ్యంలో ఇక న‌టీన‌టుల ఎంపిక ప‌నుల్లో జక్క‌న్న బిజీ అవుతార‌ని తెలుస్తోంది.

ఇప్ప‌టి వ‌ర‌కూ ఈ సినిమా లో మ‌హేష్ కి జోడీగా ఎవ‌ర్ని తీసుకొస్తారు? అందులో న‌టీన‌టులు ఎవ‌రు? హాలీవుడ్ బృందం ఎవ‌రు? అంటూ ర‌క‌ర‌కాల ప్ర‌చారం సాగుతోంది. కానీ ఎవ‌రూ పేరు తెర‌పైకి రాలేదు. రాజ‌మౌళి కూడా రిలాక్స్ అయ్యే ప‌నిలో భాగంగా ఆ విష‌యాలు పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. తాజాగా స్టోరీ లాక్ అయిన నేప‌థ్యంలో ఇక‌పై రాజ‌మౌళి మిగ‌తా ప‌నుల్లో బిజీ కానున్న‌ట్లు తెలుస్తోంది. ఈ సినిమా కి సంబంధించి మరిన్ని అప్ డేట్స్ తెలియాల్సి ఉంది.