Begin typing your search above and press return to search.

సితార పోస్ట్.. మహేష్ పై కూడా ఇంత కాంట్రవర్సీనా?

అదే సమయంలో ఇండియన్ ప్రముఖ నటీనటులు 'ఆల్‌ ఐస్‌ ఆన్‌ రఫా'తో ఉన్న ఇమేజ్‌ ను షేర్ చేసి, కాల్పులు విరమణకు అభ్యర్థించారు

By:  Tupaki Desk   |   30 May 2024 7:48 AM GMT
సితార పోస్ట్.. మహేష్ పై కూడా ఇంత కాంట్రవర్సీనా?
X

All Eyes On Rafah.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే స్లోగన్ కనిపిస్తోంది. రఫా నగరంలోని ఒక శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్‌ జరిపిన దాడిపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. పిల్లలు, మహిళలు సహా 45 మంది పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో పలువురు సెలబ్రిటీలు నెట్టింట ఈ దాడిని ఖండిస్తున్నారు. యుద్ధం గురించి అవగాహన కల్పించేందుకు పోస్ట్లు పెడుతున్నారు.

అదే సమయంలో ఇండియన్ ప్రముఖ నటీనటులు 'ఆల్‌ ఐస్‌ ఆన్‌ రఫా'తో ఉన్న ఇమేజ్‌ ను షేర్ చేసి, కాల్పులు విరమణకు అభ్యర్థించారు. సమంత, త్రిష, మాళవిక మోహనన్‌, రష్మిక, దుల్కర్ సల్మాన్‌, అమీ జాక్సన్, అలియా భట్‌, కరీనా కపూర్‌, ప్రియాంకా చోప్రా తదితరులు పాలస్తీనా ప్రజలకు తమ సంఘీభావాన్ని తెలిపారు. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార కూడా సోషల్ మీడియా లో ఆల్‌ ఐస్‌ ఆన్‌ రఫాతో ఉన్న ఇమేజ్‌ ను పోస్ట్ చేసింది.

దీంతో నెటిజన్లు తీవ్ర విమర్శలు చేశారు. అక్కడ పరిస్థితి గురించి ఆమెకు అసలు తెలియక ఉంటుందని అన్నారు. పోస్ట్ డిలీట్ చేయకపోతే మహేష్ మూవీలను బహిష్కరిస్తానని కొందరు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో సితార తన పోస్టును డిలీట్ చేసింది. సితారే కాదని... చాలా మంది అక్కడ సమస్య తెలియకుండానే పోస్టులు పెట్టారని ఆరోపిస్తున్నారు. కొందరు వైరల్ అవుతున్న పిక్ ను మాత్రమే జస్ట్ షేర్ చేస్తున్నారని అంటున్నారు.

సితార కన్నా ముందు.. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ భార్య రితికా సజ్దేహ్ కూడా తీవ్రమైన ట్రోలింగ్ ఎదుర్కొంది. ఆల్ ఐస్ ఆన్ రఫా రాసి ఉన్న పిక్ ను ఆమె షేర్ చేయగా.. నెటిజన్లు ఫుల్ ట్రోల్ చేశారు. దేశంలో మణిపూర్ వంటి ఎన్నో సమస్యలను పట్టించుకోలేదని విమర్శించారు. కనీసం రఫా ఎక్కడ ఉందో తెలియదని ఎగతాళిలా కామెంట్స్ చేశారు. దీంతో ఆమె పోస్ట్ డిలీట్ చేసింది.

రఫాపై దాడిని తక్షణం నిలిపివేయాలని అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) ఇచ్చిన ఆదేశాలను లెక్క చేయకుండా ఇజ్రాయెల్ దాడి జరిపింది. అయితే దాడి జరిగిన తల్‌ అల్‌ సుల్తాన్‌ ప్రాంతాన్ని సురక్షిత ప్రాంతంగా ఇజ్రాయెల్ కొన్ని రోజుల క్రితం ప్రకటించింది. దీంతో ఉత్తర, మధ్య గాజా నుంచి వచ్చి పాలస్తీనియన్లు ఇక్కడ గుడారాలు వేసుకొని ఉన్నారు. అలాంటి సురక్షిత ప్రాంతంపైనే ఇజ్రాయెల్‌ దాడి చేయడం దారుణం!