మురారి స్పెషల్ : మహేష్ కమిట్మెంట్ సూపర్
మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా నేడు రీ రిలీజ్ అయిన మురారి తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్స్ కి పండగ వాతావరణం కల్పించింది.
By: Tupaki Desk | 9 Aug 2024 9:23 AM GMTమహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా నేడు రీ రిలీజ్ అయిన మురారి తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్స్ కి పండగ వాతావరణం కల్పించింది. థియేటర్ లలో ఫ్యాన్స్ చేస్తూ ఉన్న హంగామా తాలూకు వీడియో లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మురారి రిలీజ్ అయ్యి దాదాపుగా పాతిక సంవత్సరాలు అయ్యింది, ఇప్పటివరకు టీవీల్లో కొన్ని వందల సార్లు టెలికాస్ట్ అయ్యింది. ఫ్యాన్స్ ఒక్కొక్కరు పదుల సార్లు మురారి సినిమాను చూసి ఉంటారు. కొందరు ఫ్యాన్స్ ముఖ్యంగా మహిళ ఫ్యాన్స్ డైలాగ్ టు డైలాగ్ గుర్తు పెట్టుకునే స్థాయిలో చాలా సార్లు చూశారు. అయినా కూడా రీ రిలీజ్ సందర్భంగా థియేటర్ కి వెళ్లారు.
సాధారణంగా పెద్ద హీరోల సినిమాల రీ రిలీజ్ అనగానే ఎక్కువ శాతం థియేటర్లలో మగవారు మాత్రమే కనిపిస్తారు. కానీ మురారి సినిమా థియేటర్ లలో మగవారికి సమానంగా అమ్మాయిలు కనిపిస్తున్నారు. మహేష్ బాబుకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మురారి థియేటర్ లో అమ్మాయిల సందడి చూస్తూ ఉంటే బాబోయ్ అనకుండా ఉండలేం. ఆ విషయాలు పక్కన పెట్టి 2001 లో వచ్చిన మురారి సినిమా మేకింగ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను కొందరు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మహేష్ బాబు పై అభిమానం మరింత పెరిగేలా చేస్తున్నారు.
ముఖ్యంగా మురారి సినిమా షూటింగ్ సమయంలో మహేష్ బాబుకు జర్వం వచ్చినా షూటింగ్ లో పాల్గొన్న సంఘటన ను ఎక్కువ మంది షేర్ చేస్తున్నారు. ఆ సంఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే... సినిమాలో మహేష్ బాబుకు ఎంతో ఇష్టమైన ఏనుగును విలన్ అయిన రవిబాబు కిడ్నాప్ చేస్తాడు. ఆ ఏనుగును రక్షించే క్రమంలో గోదావరి నీటిలో ఒక భారీ యాక్షన్ సీన్ ఉంటుంది. గోదావరి నీటిలో మహేష్ బాబు విలన్స్ గ్యాంగ్ తో ఫైట్ చేయాల్సి ఉంటుంది. ఆ సమయంలో మహేష్ బాబు తీవ్రమైన జ్వరంతో బాధ పడుతున్నాడు. అంతకు ముందే రెండు మూడు రోజులు పూర్తిగా నీటిలోనే పాట చిత్రీకరణ చేశారు.
నీటిలో పాట చిత్రీకరణ వల్ల జ్వరం వచ్చింది, అదే కంటిన్యూ అవుతున్న సమయంలో యాక్షన్ సన్నివేశాలను మళ్లీ నీటిలోనే షూట్ చేయాల్సి వచ్చింది. దర్శక నిర్మాతలు వద్దని అన్నారు. కానీ ఆ ఒక్క ఫైట్ సీన్ ను వాయిదా వేయడం వల్ల నిర్మాతకు చాలా పెద్ద నష్టం వస్తుందని భావించిన మహేష్ బాబు ఎంతటి ఇబ్బంది అయినా కూడా షూటింగ్ ఆపేది లేదు అంటూ కృష్ణవంశీ ని ఒత్తిడి చేసి మరీ షూటింగ్ ను కంప్లీట్ చేయడం జరిగింది. ఆ సమయంలో మహేష్ బాబు తెగువ చూసి అప్పుడే సూపర్ స్టార్ కృష్ణ కి తగ్గ తనయుడు మహేష్ బాబు అన్నారట.
సినిమా షూటింగ్ సమయంలో మహేష్ బాబు తనకు సన్నిహితులు అయిన వారితో చాలా క్లోజ్ గా ఉంటూ వారిపై జోక్స్ వేస్తూ ఉండేవాడట. అప్పట్లో మహేష్ బాబు చాలా రిజర్వ్ వ్యక్తి అనే ప్రచారం జరిగేది. కానీ ఆయనకు మంచిగా పరిచయం ఉన్న వారితో మాత్రం చాలా క్లోజ్ గా ఉండే వారు అని చిత్రం లో నటించిన నటీనటులు అనేవారు. సెట్స్ లో చాలా కమిట్మెంట్ తో ఉండే వారని, ఆయన్ను చూసి చాలా మంది నేర్చుకునే వారు అంటూ ఆ సినిమా కోసం వర్క్ చేసిన కొందరు ఇంటర్వ్యూల్లో చెబుతూ ఉండేవారు.