మహేష్ తో వెకేషన్ తొందర పడాల్సింది నమ్రతనే!
# ఎస్ ఎస్ ఎంబీ 29వ చిత్రం ప్రారంభానికి రంగం సిద్దమవుతోంది. ప్రస్తుతం రాజమౌళి అదే పనిలో బిజీగా ఉన్నారు.
By: Tupaki Desk | 14 Feb 2024 6:30 AM# ఎస్ ఎస్ ఎంబీ 29వ చిత్రం ప్రారంభానికి రంగం సిద్దమవుతోంది. ప్రస్తుతం రాజమౌళి అదే పనిలో బిజీగా ఉన్నారు. తాజాగా టెక్నికల్ టీమ్ కూడా ఫైనల్ అయింది. మహేష్ సరసన ఇండోనేషియా బ్యూటీని దాదా పు ఫైనల్ చేసినట్లు గా వినిపిస్తుంది. స్టోరీ కొన్ని నెలల క్రితమే కంప్లీట్ గా లాక్ అయి రెడీగా ఉంది. ఇక రెడీ టూ స్టార్ట్ అన్నట్లే. మంచి ముహూర్తం చూసుకుని ఠెంకాయ కార్యక్రమాలు ముగించి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లడమే ఆలస్యం.
మరి మహేష్ వెకేషన్ మాట సంగతేంటి? అందుకు ఆస్కారం ఉందా? ఇంత బిజీలో సాధ్యమేనా? ఇంకా ఆఛాన్సెస్ ఉన్నాయా అంటే? అవుననే తెలుస్తోంది. సినిమా రిలీజ్ కి ముందు..రిలీజ్ తర్వాత వెకేషన్లకు వెళ్లడం మహేష్ ఫ్యామిలీకి ఓ హాబీ అన్న సంగతి తెలిసిందే. `గుంటూరు కారం` రిలీజ్ తర్వాత మహేష్ ఫ్యామిలీతో ట్రిప్ వేసింది లేదు. రాజమౌళి సినిమా కోసం మహేష్ సోలోగా జర్మనీలో కొన్నిరోజుల పాటు అవసరమైన ట్రైనింగ్ తీసుకుని వచ్చేసారు.
కానీ ఫ్యామీలీతో వెకేషన్ కు వెళ్లలేదు. ఇప్పుడు గనుక రాజమౌళి షూట్ మొదలు పెడితే రెండేళ్ల పాటు ఎలాంటి వెకేషన్లు ఉండవు. పూర్తిగా బాండ్ అయిన పనిచేయాల్సి ఉంది. మరి మహేష్ ఇప్పుడున్న బిజీలో వెకేషన్ కి ఛాన్స్ ఉందా? అంటే ఉందని తెలుస్తోంది. రాజమౌళి ఆరు నెలలు పాటు వర్క్ షాప్స్ నిర్వహిం చాలని చూస్తున్నట్లు తాజా సమాచారం. `బాహుబలి`..`ఆర్ ఆర్ ఆర్` తరహాలోనే ముందుగానే వర్క్ షాప్స్ నిర్వహిస్తే ఓ క్లారిటీ వస్తుందని అందుకు తగ్గ ప్రణాళిక చేస్తున్నట్లు సమాచారం.
స్టోరీ డిమాండ్ మేరకు ఇలాంటి నిర్వహిస్తే లోటు పాటులు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ అలా మొదలైతే గనుక మహేష్ ఈ గ్యాప్ లో వేకేషన్ కి వెళ్లి వచ్చేయోచ్చు. షూట్ అప్పటికీ ప్రారంభం కాదు కాబట్టి ఓ వారం రోజుల పాటు ట్రిప్ వేసే ఛాన్స్ ఉంది. అయితే అది వెంటనే జరగాలి. ఎంత ఆలస్యం చేస్తే అంతకంతకు మహేష్ బిజీ అయిపోతాడు. ఇప్పుడు తొందర పడాల్సింది నమ్రత..పిల్లలు మాత్రమే.