Begin typing your search above and press return to search.

ప్రభాస్ రికార్డును బ్లాస్ట్ చేసిన మహేష్

కంప్లీట్ కమర్షియల్ కామెడీ యాక్షన్ ఎలిమెంట్స్ తో గుంటూరు కారం సినిమా ఉండబోతోందని ట్రైలర్ తోనే త్రివిక్రమ్ స్పష్టం చేశాడు.

By:  Tupaki Desk   |   9 Jan 2024 4:12 AM GMT
ప్రభాస్ రికార్డును బ్లాస్ట్ చేసిన మహేష్
X

సూపర్ స్టార్ మహేష్ బాబు స్టామినా గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. సినిమా సినిమాకి అతని ఇమేజ్ పెరుగుతూ వెళ్తోంది. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేసిన గుంటూరు కారం మూవీతో జనవరి 12న ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. శ్రీలీల, మీనాక్షి చౌదరి ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

ఇదిలా ఈ మూవీ ట్రైలర్ తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. కంప్లీట్ కమర్షియల్ కామెడీ యాక్షన్ ఎలిమెంట్స్ తో గుంటూరు కారం సినిమా ఉండబోతోందని ట్రైలర్ తోనే త్రివిక్రమ్ స్పష్టం చేశాడు. అక్కడక్కడ త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ కూడా బాగానే పేలాయి. రెగ్యులర్ కమర్షియల్ పాయింట్ తోనే ఈ మూవీ ఉండబోతోందని ట్రైలర్ బట్టి అర్ధమవుతోంది. కానీ మహేష్, త్రివిక్రమ్ అంటే ఏదో మాయచేస్తారనే నమ్మకం ఆడియన్స్ లో ఉంది.

ఇక ఈ ట్రైలర్ కి ఊహించని స్థాయిలో వ్యూస్ వచ్చాయి. కేవలం 24 గంటల్లోనే ఏకంగా 37 మిలియన్స్ వ్యూస్ ని సొంతం చేసుకుంది. తెలుగు మూవీ ట్రైలర్స్ కి వచ్చిన వ్యూస్ రెస్పాన్స్ లో ఇది ఆల్ టైం రికార్డ్ అని చెప్పాలి. సలార్ ఇప్పటి వరకు 32.6 మిలియన్ వ్యూస్ తో టాప్ లో ఉంటే దానిని గుంటూరుకారం బీట్ చేసేసింది. ఇక్కడ సలార్ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో ఏకంగా ఐదు భాషలలో రిలీజ్ చేశారు.

అయితే గుంటూరు కారం మూవీ ఒక్క తెలుగులోనే రిలీజ్ అవుతోంది. ఈ వ్యూస్ మట్టి ఆడియన్స్ గుంటూరు కారం సినిమా కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారు అనేది చెప్పొచ్చు. ఈ సినిమా తర్వాత మహేష్ నుంచి మరో రెండేళ్ల వరకు మూవీ రాకపోవచ్చు. జక్కన్న దర్శకత్వంలో సినిమాని మహేష్ బాబు స్టార్ట్ చేయాల్సి ఉంది. అది ఈ ఏడాదిలోనే ఆరంభం అవుతుంది.

అయితే షూటింగ్ కి ఎప్పుడు వెళ్తుందనేది క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలోనే గుంటూరు కారం సినిమాపైన ఆడియన్స్ ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే సంక్రాంతికి ఫ్యామిలీ అంతా కలిసి చూడగలిగే చిత్రంగా త్రివిక్రమ్ మూవీ ఉంటుంది. ఈ వైబ్ గుంటూరుకారం సినిమాకి కలిసొచ్చే అంశం అని చెప్పొచ్చు.