మోడల్‌తో ఆటాడుకున్నాడు.. టెన్నిస్ ఆటగాడిపై నటి!
మహిమా చౌదరి.. టాలీవుడ్ బాలీవుడ్ లో నటించింది. సుభాష్ ఘాయ్ దర్శకత్వం వహించిన `పర్దేస్` మొదటి సినిమా. తనదైన అందం, నటనతో భారీ ఫాలోయింగ్ తెచ్చుకుంది.
By: Tupaki Desk | 2 March 2025 7:00 PM ISTమహిమా చౌదరి.. టాలీవుడ్ బాలీవుడ్ లో నటించింది. సుభాష్ ఘాయ్ దర్శకత్వం వహించిన `పర్దేస్` మొదటి సినిమా. తనదైన అందం, నటనతో భారీ ఫాలోయింగ్ తెచ్చుకుంది. శ్రీకాంత్, జగపతి బాబు వంటి తెలుగు స్టార్లతో మహిమ `మనసులో మాట` అనే చిత్రంలో నటించింది. మహిమ అందచందాలు నటప్రతిభకు గుర్తింపు దక్కింది.
అయితే మహిమ నటించిన సినిమాల కంటే, ఎఫైర్ల గురించే ఎక్కువగా చర్చ సాగింది. మాజీ భారత టెన్నిస్ ప్లేయర్ లియాండర్ పేస్‌తో ఉన్న సంబంధం కారణంగా కూడా మహిమా చౌదరి హెడ్ లైన్స్ లోకొచ్చింది. ఈ జంట సుమారు మూడేళ్ల పాటు డేటింగ్ చేసారు. క్రీడాకారుడైన పేస్‌కి ఎప్పుడూ మద్దతుగా ఉంది. పేస్ మ్యాచ్ లు ఆడేచోట మహిమ వాలిపోయేది. అయితే ఈ జంట తరువాత విడిపోయింది. సంజయ్ దత్ మాజీ భార్య, మోడల్ రియా పిళ్లైతో లియాండర్ ఫేస్ ఎఫైర్ తాము విడిపోవడానికి కారణమని మహిమ ఆరోపించింది.
ఓ చాటింగ్ సెషన్ లో మహిమ తన గత సంబంధాల గురించి మరింత డెప్త్ గా మాట్లాడింది. అతడు మంచి టెన్నిస్ ఆటగాడు కావచ్చు కానీ, నాతో సరిగ్గా ఆడలేదు. అతడు వేరొకరితో తిరుగుతున్నాడని తెలిసినప్పుడు అది నాకు షాకింగ్ వార్త కాదు. అతడి నిష్క్రమణ నా జీవితంపై ఎలాంటి ప్రభావం చూపలేదు. నేను ఒక వ్యక్తిగా మరింత పరిణతి చెందాను.. అని మహిహ ఘాటుగా చెప్పింది. రియా (పిళ్లై)ని అలానే మోసం చేసాడని కూడా అంది. రియాపై గృహ హింసకు పాల్పడినందుకు లియాండర్ పేస్ దోషిగా తేలాడు. కలిసి జీవించకపోతే రియాకు అతడు నెలవారీ రూ. 1 లక్ష భత్యం, ఇంటి అద్దె రూ. 50,000 చెల్లించాలని కోర్టు ఆదేశించింది. మహిమ 2006లో ఆర్కిటెక్ట్ కం వ్యాపారవేత్త బాబీ ముఖర్జీని పెళ్లాడారు. అయితే తర్వాత 2011లో కలతల కారణంగా ఈ జంట విడిపోయారు. మహిమకు 8 సంవత్సరాల కుమార్తె అరియానా ఉంది. లియాండర్ పేస్ రియా, మహిమల నుంచి విడిపోయాక నటి కిమ్ శర్మతోను డేటింగ్ చేసాడు. కెరీర్ మ్యాటర్ కి వస్తే.. మహిమ తదుపరి కంగనా రనౌత్ దర్శకత్వం వహించిన `ఎమర్జెన్సీ` చిత్రంలో పుపూర్ జయకర్ పాత్రను పోషించారు.