Begin typing your search above and press return to search.

ఆ ఒక్క లీక్‌ ఫోటో ఆమె కెరీర్‌ని నాశనం చేసింది

సోషల్‌ మీడియా ద్వారా సెలబ్రెటీల ఫోటోలు, వీడియోలు రెగ్యులర్‌గా వైరల్‌ అవుతూనే ఉంటాయి.

By:  Tupaki Desk   |   18 Dec 2024 7:45 AM GMT
ఆ ఒక్క లీక్‌ ఫోటో ఆమె కెరీర్‌ని నాశనం చేసింది
X

సోషల్‌ మీడియా ద్వారా సెలబ్రెటీల ఫోటోలు, వీడియోలు రెగ్యులర్‌గా వైరల్‌ అవుతూనే ఉంటాయి. కొన్ని ఫోటోలు వారి ప్రమేయం లేకుండా లీక్ అవుతాయి. ఆ ఫోటోల వల్ల ఒక్కసారిగా స్టార్‌డం దక్కిన వారు ఉంటారు, అలాగే తమ స్టార్‌డంను కోల్పోయిన వారు ఉంటారు. కొన్ని ఫోటోలు గౌరవాన్ని పెంచే విధంగా ఉంటే, కొన్ని ఫోటోలు పరువు తీసే విధంగా ఉంటాయి. ముఖ్యంగా హీరోయిన్స్‌ ఫోటోల వల్ల ఇబ్బందులు పడ్డ సందర్భాలు చాలానే ఉంటాయి. అందుకే పబ్లిక్‌లో ఉన్నప్పుడు హీరోయిన్స్‌ చాలా చాలా జాగ్రత్తగా ఉండటం మనం గమనించవచ్చు.

పాకిస్తాన్‌ ముద్దుగుమ్మ మహీరా ఖాన్ నటిగా ఎన్నో సినిమాల్లో నటించింది. ఇండియన్‌ సినీ ప్రేక్షకులకు ఈమె సుపరిచితురాలు. హిందీ సినిమా ఇండస్ట్రీలో ఈమెకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అనే విషయం తెల్సిందే. ఇండస్ట్రీలో వరుస సినిమాలతో మంచి పేరు సొంతం చేసుకుని దూసుకు పోతున్న సమయంలో అనూహ్యంగా ఒక ఫోటో లీక్ కావడంతో మొత్తం కెరీర్ తలకిందు అయ్యింది. ఆ విషయాన్ని గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో మహీరా ఖాన్ మాట్లాడుతూ తన ఆవేదన వ్యక్తం చేసింది. ఆ ఒక్క ఫోటో మొత్తం తలకిందులు చేసిందని ఆవేదన వ్యక్తం చేసింది.

మహీరా ఖాన్ మాట్లాడుతూ... నా జీవితంలో కొన్ని సంఘటనలు జీవితాన్ని నాశనం చేశాయి. ముఖ్యంగా పెళ్లి చేసుకోవడం, పెళ్లి చేసుకున్న వ్యక్తితో విభేదాల కారణంగా విడి పోవడం, పాప పుట్టడం, ఆ తర్వాత సింగిల్‌గా ఉండటం నా కెరీర్‌ను దెబ్బ తీశాయి. ఆ సమయంలోనే రణబీర్‌ కపూర్‌తో కలిసి ఉన్న ఫోటోలో సిగరెట్‌ తాగుతూ ఉన్న ఫోటో లీక్ కావడం అనేది నా జీవితంను మలుపు తిప్పింది. నాపై ఒక వర్గం వారు ద్వేషం పెంచుకోవడంతో పాటు ఏకంగా దేశం నుంచి బహిష్కరణకు గురి కావాల్సి వచ్చిందని మహీరా చెప్పుకొచ్చింది.

బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ షారుఖ్‌ ఖాన్‌ సినిమాలో నటించడం ద్వారా బాలీవుడ్‌లో పాపులారిటీ సొంతం చేసుకున్న మహీరా ఖాన్‌ చాలా తక్కువ సమయంలోనే తన ఫామ్‌ కోల్పోయింది. అంతే కాకుండా తన తప్పుడు నిర్ణయాలు, లీక్ ఫోటో కారణంగా పాకిస్తాన్‌లో కనీసం అడుగు పెట్టే పరిస్థితి లేకుండా చేసుకుంది. కెరీర్‌ సాఫీగా సాగుతున్న సమయంలో తీసుకున్న నిర్ణయాలు, తప్పుడు ఆలోచనలు, చెడు దారిన నడవండం వంటివి చేస్తే కెరీర్‌ అర్థాంతరంగా ఆగుతుంది అంటూ మహీరా ఖాన్‌ జీవితాన్ని, ఆమె కెరీర్‌ గ్రాఫ్‌ ని చూస్తే అనిపిస్తుంది. కనుక ఈమె ఉదంతం యువ హీరో హీరోయిన్స్‌కి తగిన గుణపాఠంగా నిలుస్తుంది.