బిగ్ బాస్ పాప గ్లామర్ ఎటాక్.. రెండు కళ్ళు సరిపోవేమో..
బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టి ప్రేక్షకుల మనసు గెలుచుకున్న మహీరా శర్మ తన అందంతో ఎప్పుడూ హాట్ టాపిక్‌గా మారుతూనే ఉంటుంది.
By: Tupaki Desk | 22 March 2025 12:33 AM ISTబిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టి ప్రేక్షకుల మనసు గెలుచుకున్న మహీరా శర్మ తన అందంతో ఎప్పుడూ హాట్ టాపిక్‌గా మారుతూనే ఉంటుంది. ఈ నార్త్ బ్యూటీ మోడలింగ్, టీవీ సీరియల్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకొని, బాలీవుడ్ వైపు అడుగులు వేసింది. ‘బిగ్‌బాస్ 13’లో తన హావభావాలు, గ్లామరస్ లుక్, ఫ్రాంక్ నేచర్‌తో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత పలు మ్యూజిక్ వీడియోస్, యాడ్స్, వెబ్ సిరీస్‌లు చేస్తూ తన కెరీర్‌ను మరింత వైవిధ్యంగా కొనసాగిస్తోంది.
మహీరా పేరు వచ్చినప్పుడు ఫ్యాషన్, ట్రెండీ లుక్స్, స్టన్నింగ్ ఫోటోషూట్స్ గురించి చర్చ తప్పదు. ఇటీవల మహీరా తన లేటెస్ట్ ఫోటోషూట్‌తో మరోసారి అందరి చూపులను ఆకర్షించింది. ఈసారి సిల్కీ ట్రెడిషనల్ లుక్‌లో కనిపించిన ఆమె, వెండితెర అందాలరాశిలా మెరిసిపోతూ ఫ్యాషన్ ప్రేమికులను మైమరపించింది. లైట్ సిల్వర్ కలర్ సారి, మోడ్రన్ జువెలరీ, సింపుల్ యెట్ స్టన్నింగ్ మేకప్‌తో మహీరా ఒదిగిపోయిన సాంప్రదాయ హొయలతో కనువిందు చేసింది.
కేవలం గ్లామర్ మాత్రమే కాదు, తన స్టైల్ స్టేట్మెంట్‌తో ట్రెడిషనల్ లుక్స్ కూడా ఎంత హాట్‌గా ఉండొచ్చో మరోసారి నిరూపించింది. కారు దగ్గర తన స్టన్నింగ్ పోజ్ ఇచ్చిన మహీరా, రివీల్ చేసే స్టైల్‌తో అభిమానుల హృదయాలను దోచుకుంటోంది. ఈ క్యూట్ బ్యూటీ మల్టీ కలర్, స్టైలిష్ మెటాలిక్ ఆభరణాలతో, తన వయ్యారమైన హావభావాలతో గ్లామర్ కు కొత్త డెఫినిషన్ ఇచ్చేసింది.
ఫోటోలన్నీ చూస్తుంటే, ఆమె ఎక్స్‌ప్రెషన్లే ఓ స్పెషల్ హైలైట్ అని చెప్పాలి. కేవలం వెస్ట్రన్ లుక్‌లోనే కాదు, ఇలాంటి డిజైనర్ ట్రెడిషనల్ అవతార్‌లో కూడా మహీరా అదరగొట్టడం వెనుక ఆమె స్టైల్ సెన్స్‌కి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉందని స్పష్టంగా అర్థమవుతోంది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మహీరా తన మాస్ అప్పీల్, ట్రెడిషనల్ లుక్స్‌తో మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చింది. అభిమానులు ‘ఏంజెలిక్ బ్యూటీ’, ‘గ్లామర్ క్వీన్’, ‘ఇలాంటి లుక్స్‌లో నువ్వు సో గ్రేట్’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.