యాత్ర 2 పై విమర్శలు.. డిఫెండ్ చేయనంటున్న డైరెక్టర్..!
మహి వి రాఘవ దర్శకత్వంలో తెరకెక్కిన యాత్ర 2 గురువారం రిలీజైంది. 2019 లో వచ్చిన యాత్ర సినిమాకు కొనసాగింపుగా యాత్ర 2 వచ్చింది
By: Tupaki Desk | 9 Feb 2024 12:06 PM GMTమహి వి రాఘవ దర్శకత్వంలో తెరకెక్కిన యాత్ర 2 గురువారం రిలీజైంది. 2019 లో వచ్చిన యాత్ర సినిమాకు కొనసాగింపుగా యాత్ర 2 వచ్చింది. యాత్ర సినిమా వైఎస్సార్ పాదయాత్ర ఆధారంగా రూపొందించగా యాత్ర 2 దానికి కొనసాగింపుగా 2009 నుంచి 2019 వరకు జరిగిన రాజకీయ పరిస్థితులను ప్రస్తావించారు. ఈ సినిమాలో వైఎస్సార్ గా మలయాళ స్టార్ మమ్ముట్టి నటించగా వైఎస్ జగన్ పాత్రలో తమిళ హీరో సూర్య నటించారు. ఫిబ్రవరి 8న రిలీజైన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ సందర్భంగా యాత్ర 2 సక్సెస్ మీట్ ని చిత్ర యూనిట్ నిర్వహించారు.
ఈ సక్సెస్ మీట్ సందర్భంగా డైరెక్టర్ మహి వి రాఘవ మీడియాతో మాట్లాడుతూ.. నేను తీసిన యాత్ర 2 కొందరికి నచ్చింది.. ఇంకొందరికి నచ్చలేదు.. తీసిందే పొలిటికట్ మూవీ, రాజకీయ నాయకుడి మీద కాబట్టి.. భిన్నాభిప్రాయాలు రావడం సహజం. ఒక స్టోరీ టెల్లర్‌గా, నేను అనుకున్న కథ, స్క్రిప్ట్‌ను తీశాను. చాలా మందికి నా సినిమా నచ్చింది. అందరూ తమ తమ అభిప్రాయాలు పంచుకున్నారు. కొంత మంది పాజిటివ్‌గా రివ్యూ ఇచ్చారు. ఇంకొంత మంది నెగిటివ్ రివ్యూలు ఇచ్చారు. ఫిల్మ్ మేకర్లుగా సినిమాను తీయడం మా బాధ్యత. విమర్శించారు కదా? నేనేమీ దాన్ని డిఫెండ్ చేసుకోను. మా టెక్నికల్ టీంకు థాంక్స్. మమ్ముట్టి గారు, జీవా గారికి థాంక్స్ అని అన్నారు.
ఒక సినిమా రిలీజ్ అయ్యాక దాని నుంచి బయటకు వచ్చేస్తా. యాత్ర 2 తీయాలని 2019 లోనే నిర్ణయించుకున్నా. తండ్రీ కొడుకుల కథ చెప్పాలని అనుకున్నా. ఆ కథకు తగ్గట్టుగానే పాత్రలను పెట్టాను. వేరే పాత్రలు లేవు అని అంతా అడుగుతుంటారు. కానీ నా కథకు తగ్గట్టుగానే నేను పాత్రలు పెట్టుకున్నాను. సీఎం వైఎస్ జగన్ గారు ఇంకా సినిమాను చూడలేదు. త్వరలోనే చూస్తారు. నంద్యాల బై ఎలక్షన్ సీన్ తీశాను. కానీ ఎడిటింగ్‌లో తీసేశాను. సినిమా విడుదలై ఒక్క రోజే అయింది. సినిమా విడుదల రోజే మేం థియేటర్లకు వెళ్తే రియాల్టీ తెలియదు.
సోమవారం నుంచి రియల్ టాక్ తెలుస్తుంది. థియేటర్లో మ్యూజిక్, విజువల్స్, డైలాగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. నాకు వీలైనంతగా సినిమాను ప్రమోట్ చేసేందుకు ప్రయత్నిస్తా. మీడియా కూడా సహకరించాలి. త్వరలోనే సేవ్ ది టైగర్స్ 2 వస్తుంది. నేను ఓ కథను రాయడానికే టైం పడుతుంది. మెల్లిగానే సినిమాలు చేస్తాను. కొంత బ్రేక్ తీసుకుని సినిమాలు చేయాలని అనుకుంటున్నానని అన్నారు.