Begin typing your search above and press return to search.

యాత్ర 2 డైరెక్టర్.. ఇప్పుడు ఏం చేస్తున్నాడు?

మరల 2024 ఎన్నికలకి ముందు మహి వి రాఘవ యాత్ర 2ని రిలీజ్ చేశారు.

By:  Tupaki Desk   |   27 Jun 2024 4:44 AM GMT
యాత్ర 2 డైరెక్టర్.. ఇప్పుడు ఏం చేస్తున్నాడు?
X

మహి వి రాఘవ అంటే వెంటనే గుర్తుకొచ్చే సినిమాలు యాత్ర, యాత్ర 2. ఈ రెండు సినిమాలలో యాత్ర మూవీ సూపర్ హిట్ అయ్యింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో ఈ మూవీని ఆవిష్కరించారు. ఈ సినిమా 2019 ఎన్నికలకి ముందు రిలీజ్ అయ్యింది జగన్ గెలుపులో కూడా యాత్ర మూవీ ఇంపాక్ట్ క్రియేట్ చేసిందనే మాట వినిపించింది. మరల 2024 ఎన్నికలకి ముందు మహి వి రాఘవ యాత్ర 2ని రిలీజ్ చేశారు.

రాజశేఖర్ రెడ్డి మరణాంతరం వైఎస్ జగన్ ఓదార్పు యాత్ర, పాదయాత్ర నేపథ్యంలో ఈ చిత్రాన్ని మహి వి రాఘవ చేశారు. అయితే యాత్ర 2 ఆశించిన స్థాయిలో ప్రేక్షకులకి కనెక్ట్ కాలేదు. ఈ చిత్రం తర్వాత మహి వి రాఘవ నుంచి ఎం సినిమా వస్తుందో తెలుసుకోవాలనే ఇంటరెస్ట్ అందరిలో ఉంది. సినిమాలు చేస్తూనే ఈ దర్శకుడు సేఫ్ ది టైగర్స్, సైతాన్ వెబ్ సిరీస్ లు చేసి సక్సెస్ అందుకున్నాడు.

ఇదిలా ఉంటే నెక్స్ట్ మహి మళ్ళీ బయోపిక్ ట్రై చేస్తాడా లేదంటే కొత్త కథతో వస్తాడా అనే ప్రశ్న కొద్ది రోజుల నుంచి వినిపిస్తోంది. దీనికి తాజాగా క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. యాత్ర సినిమాలో రాజశేఖర్ రెడ్డి పాత్రలో మమ్ముట్టి నటించారు. ఇప్పుడు మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ తో మహి వి రాఘవ పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది.

దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా వివిధ భాషలలో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. మలయాళంలో ఇప్పటికే స్టార్ గా ఎస్టాబ్లిష్ అయిన దుల్కర్ తెలుగులో మహానటి, సీతారామం సినిమాలతో వరుస సక్సెస్ లు అందుకున్నారు. ఇప్పుడు లక్కీ భాస్కర్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతుంది. కల్కి చిత్రంలో కూడా దుల్కర్ ఓ ఇంటరెస్టింగ్ రోల్ లో కనిపించారు.

మహి వి రాఘవ ఇప్పటికే దుల్కర్ ని కలిసి స్టోరీ నేరేషన్ చేసారంట. ఆయనకి కథ నచ్చి ఒకే చేసినట్లు టాక్ వినిపిస్తోంది. టాలీవుడ్ కి చెందిన ఓ బిగ్ ప్రొడక్షన్ హౌస్ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్ లో భారీ బడ్జెట్ తో నిర్మించబోతోంది. త్వరలో ఈ సినిమాకి సంబందించిన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రానుందని తెలుస్తోంది. మరి ఈ మూవీని ఎలాంటి కథాంశంతో మహి వి రాఘవ చేయబోతున్నాడు అనేది తెలియాల్సి ఉంది.