Begin typing your search above and press return to search.

మ‌రో మ‌సాలా సినిమాకి సీక్వెల్!

ఈ నేప‌థ్యంలో తాజాగా మ‌రో 20 ఏళ్ల క్రితం నాటి సినిమాకి సీక్వెల్ ని లైన్ లోకి తెచ్చారు.

By:  Tupaki Desk   |   6 Feb 2025 8:30 AM GMT
మ‌రో మ‌సాలా సినిమాకి సీక్వెల్!
X

సీక్వెల్స్ తో స‌క్సెస్ అన్న‌ది బాలీవుడ్ కే చెల్లింది. 20-30 ఏళ్ల క్రితం హిట్ సినిమాల్ని కూడా త‌వ్వి తీసి వాటికి సీక్వెల్స్ చేస్తున్నారు. ఇట‌వ‌లే 20 ఏళ్ల క్రితం నాటి `నో ఎంట్రీ` సీక్వెల్ ని ప్ర‌కటించారు. ఈ నేప‌థ్యంలో తాజాగా మ‌రో 20 ఏళ్ల క్రితం నాటి సినిమాకి సీక్వెల్ ని లైన్ లోకి తెచ్చారు. షారుక్ ఖాన్ కథానాయ‌కుడిగా ప‌ర్హాన్ ఖాన్ తెరకెక్కించిన `మై హూన్ నా` అప్ప‌ట్లో సంచ‌ల‌నం విజ‌యం సాధించింది. ఈ మ‌సాలా ఎంట‌ర్ టైన‌ర్ కి ఎంతో మంది అభిమానులున్నారు.

షారుక్ ఖాన్, సునీల్ శెట్టి, సుస్మితాసేన్, అమృత‌రావు కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన చిత్ర‌మిది. 2004లో రిలీజ్ అయింది. షారుక్ ఖాన్ సొంత నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ పై నిర్మించిన మొట్ట మొద‌టి చిత్ర‌మిదే. ఈ సినిమా అంటే షారుక్ ఖాన్, గౌరీఖాన్ దంప‌తుల‌కు ఎంతో ప్రత్యేక‌మైనది. తొలి సినిమానే భారీ విజ‌యం సాధించి సంస్త‌కు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. అందుకే ఈ సినిమా వారికి చాలా ప్ర‌త్యేకం. అయితే ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్ ప్ర‌క‌టించారు.

ప్ర‌స్తుతం ఫరాఖాన్ ర‌చ‌యిత‌ల బృందం స్క్రిప్ట్ ప‌నుల్లో ఉన్న‌ట్లు వెల్ల‌డించారు. `హై హూ నా -2` టైటిల్ తో ప‌ట్టాలెక్కించ‌నున్నారు. త్వ‌ర‌లోనే ప్రాజెక్ట్ కి సంబంధించిన పూర్తి వివ‌రాలు వెల్ల‌డించ‌నున్నార‌ని తెలుస్తోంది. ఈ ఏడాది మ‌రిన్ని ఓల్డ్ క్లాసిక్ చిత్రాల సీక్వెల్స్ కి బాలీవుడ్ స‌న్నాహాలు చేస్తున్న‌ట్లు తెలిసింది. అలాగే లేటెస్ట్ హిట్ సినిమాల‌కు సీక్వెల్స్ కి ఎండింగ్ లో హింట్ ఇస్తున్నారు. వాటికి కొన‌సాగింపుగా పార్ట్ -2 ల‌ను తెర‌పైకి తేవ‌డం ఎక్కువైంది.

ప్ర‌యోగాల‌ను త‌గ్గించి ఈ త‌ర‌హా కంటెంట్ తో స‌క్సెస్ రేట్ పెంచుకునే దిశ‌గా బాలీవుడ్ అడుగులు వేస్తున్న‌ట్లు క‌నిపిస్తుంది. సీక్వెల్స్ అంటే ఒక‌ప్పుడు నాలుగైదేళ్లు అయినా స‌మ‌యం తీసుకునే వారు. కానీ ఇప్పుడంత స‌మ‌యం తీసుకోవ‌డం లేదు. హిట్ అయితే చాలా అదే బ్రాండ్ తో మార్కెట్ లోకి వ‌చ్చేస్తున్నారు.