Begin typing your search above and press return to search.

మజాకా ధమాకా రీచ్ ఉంటుందా..?

అందుకే త్రినాథ రావు లాంటి ఎంటర్టైన్మెంట్ అందించే దర్శకులకు సక్సెస్ రేటు ఎక్కువ ఉంటుంది.

By:  Tupaki Desk   |   20 Feb 2025 2:30 AM GMT
మజాకా ధమాకా రీచ్ ఉంటుందా..?
X

టికెట్ కొన్న ఆడియన్స్ కి కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ అందిస్తే చాలు అనుకునే దర్శకులు చాలా మంది ఉన్నారు. ఐతే వారిలో ప్రతి సినిమాకు ఆడియన్స్ ని కడుపుబ్బా నవ్వించాలని ప్రయత్నించే దర్శకులు కాస్త తక్కువ. ఐతే ఈ తరం దర్శకుల్లో అలాంటి సినిమాలు చేస్తూ ఆడియన్స్ ని అలరిస్తున్నాడు డైరెక్టర్ నక్కిన త్రినాథరావు. సినిమా అంటే ఆడియన్స్ థియేటర్ లో కూర్చున్నప్పుడు తన కష్టాలన్నీ మర్చిపోయి హాయిగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటాడు. అందుకే త్రినాథ రావు లాంటి ఎంటర్టైన్మెంట్ అందించే దర్శకులకు సక్సెస్ రేటు ఎక్కువ ఉంటుంది.

ధమాకా తర్వాత మరో సూపర్ ఎంటర్టైనర్ తో రావాలని చూసిన త్రినాథరావు మజాకా అంటూ మరో అటెంప్ట్ చేశాడు. సందీప్ కిషన్, రీతు వర్మ లీడ్ రోల్స్ లో నటించిన ఈ సినిమాను హాస్య మూవీస్ బ్యానర్ లో రాజేష్ నిర్మించారు. ఏకె ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో అనిల్ సుంకర కూడా ఈ సినిమాను సమర్పిస్తున్నారు. మజాకా సినిమా టీజర్ ఆడియన్స్ ని అలరించింది. టీజర్ తోనే త్రినాథరావు మార్క్ కనిపించింది.

అంతేకాదు ఈ మధ్య సంక్రాంతికి వస్తున్నాం సినిమాను లీడ్ కాస్టింగ్ తో ఎలాగైతే సినిమా ప్రమోషన్ చేశారో అలానే ఈ సినిమాను కూడా ప్రమోట్ చేస్తున్నారు. సందీప్ కిషన్ మజాకా మరో ధమాకా అవుతుందా లేదా అన్నది చర్చ జరుగుతుంది. ధమాకా సినిమా ఏకంగా త్రినాథరావుని 100 కోట్ల క్లబ్ లో నిలిచేలా చేసింది. మరి ఆ సినిమా తర్వాత చేసిన మజాకా ఆ రేంజ్ రిజల్ట్ అందుకుంటుందా లేదా అన్నది చూడాలి.

మజాకా విషయంలో సందీప్ కిషన్ కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఫిబ్రవరి 26న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. సందీప్ కిషన్ మజాకా త్రినాథ రావు మార్క్ ఫన్ ఫిల్డ్ ఎంటర్టైనర్ గా రాబోతుంది. సినిమా సాంగ్ ని రీసెంట్ గా షూట్ చేయగా దాన్ని వెరైటీగా లైవ్ ఇచ్చి సర్ ప్రైజ్ చేశారు చిత్ర యూనిట్. ఇక ఇప్పటికే సినిమా నుంచి రిలీజైన సాంగ్స్ మంచి బజ్ ఏర్పరచగా సినిమా ఏమాత్రం పాజిటివ్ గా ఉన్నా సక్సెస్ కొట్టినట్టే అని చెప్పొచ్చు. కామెడీ మీద మంచి పట్టు ఉన్న డైరెక్టర్ గా త్రినాథరావు మాత్రం మజాకాతో మరో హిట్ కన్ఫర్మ్ అనేస్తున్నారు.