Begin typing your search above and press return to search.

బికినీలో మజిలీ బ్యూటీ.. లెగ్స్ అందాల మాయ

అమ్మడుకు ఈ సినిమా భారీ విజయాన్ని అందించడంతో పాటుగా నటిగా మంచి మార్కులు కూడా పడ్డాయి.

By:  Tupaki Desk   |   23 Jan 2024 4:24 PM GMT
బికినీలో మజిలీ బ్యూటీ.. లెగ్స్ అందాల మాయ
X

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన సూపర్ హిట్ మూవీ మజిలీ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది హీరోయిన్ దివ్యాంశా కౌశిక్. అమ్మడుకు ఈ సినిమా భారీ విజయాన్ని అందించడంతో పాటుగా నటిగా మంచి మార్కులు కూడా పడ్డాయి. తొలి సినిమాతోనే అందరి దృష్టి ఆకర్షించిందీ బ్యూటీ.


ఫస్ట్ మూవీ బ్లాక్ బస్టర్ అయినప్పటికీ అనుకున్నంతలా ఆమెకు అవకాశాలు రాలేదు. వచ్చిన ఛాన్సులు చేజిక్కించుకున్నా.. బ్రేక్ ఇవ్వలేదు. దీంతో సినిమాలకు మెల్ల మెల్లగా దూరమవుతోంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటోంది. ఎప్పటికప్పుడు మైండ్ బ్లాక్ అయ్యేలా ఫొటోలు పోస్ట్ చేస్తుంటుంది. తన ఫ్యాన్స్ ను అలరిస్తుంటోంది.


తాజాగా బికినీ వేసుకున్న పిక్స్ ను షేర్ చేసింది దివ్యాంశ. ఫస్ట్ ఫొటో కాస్త బ్లర్ గా ఉన్నా.. ఫుల్ ఫిట్ గా కనిపిస్తోంది అమ్మడు. తన అందచందాలతో ఆకట్టుకుంటోంది. మరో ఫొటోలో థైస్ షో చేసింది. ఆమె లెగ్స్ అందాలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే. ప్రస్తుతం ఈ పిక్స్.. నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. దివ్యాంశ గ్లామర్ డోస్ కు ఫిదా అవుతున్నారు. లైకుల వర్షం కురిపిస్తున్నారు.

ముస్సోరీ ఇంటర్నేషనల్ స్కూల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన దివ్యాంశ.. మోడల్‌ గా కెరీర్ ప్రారంభించింది. మోడల్‌ గా ఎదిగేందుకు ఢిల్లీ నుంచి ముంబైకి మకాం మార్చింది. ఆ తర్వాత మజిలీ మూవీలో ఛాన్స్ కొట్టేసింది. టాలీవుడ్ లో ఫ్యాన్స్ ను సంపాదించుకుంది. కానీ అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ వైపు మొగ్గు చూపింది.

2021లో ది వైఫ్ సినిమాలో నటించింది. కానీ ఆ మూవీ పెద్ద గుర్తింపు తీసుకురాలేదు. దీంతో దివ్యాంశ మళ్లీ దక్షిణాది చిత్రాలపై తన ఫోకస్ పెట్టింది. 2022లో రామారావు ఆన్ డ్యూటీలో రవితేజ సరసన నటించినా హిట్ కొట్టలేకపోయింది. సందీప్ కిషన్ మైఖేల్ మూవీలోనూ మెరిసింది. ఆ తర్వాత పోలీస్ వారి హెచ్చరికలో కనిపించినా కమ్ బ్యాక్ ఇవ్వలేకపోయింది.

గతేడాది హీరో సిద్ధార్థ్ తో నటించే ఛాన్స్ దక్కించుకుంది. టక్కర్ మూవీలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీపైనే ఆశలన్నీ పెట్టుకుంది. ఆ ఆశలు కూడా అడియాశలయ్యాయి. ప్రస్తుతం ఆమె చేతిలో ఒక్క సినిమా కూడా లేనట్లు తెలుస్తోంది. మరి ఈ బ్యూటీ 2024లో అయినా గట్టి కమ్ బ్యాక్ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.