మేజర్ పార్టు ముంబైలోనే ప్లాన్ చేసారా?
కోలీవుడ్ స్టార్ ధనుష్ 51వ చిత్రాన్ని టాలీవుడ్ మేకర్ శేఖర్ కమ్ములా తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 6 Dec 2023 6:44 AM GMTకోలీవుడ్ స్టార్ ధనుష్ 51వ చిత్రాన్ని టాలీవుడ్ మేకర్ శేఖర్ కమ్ములా తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. శేఖర్ మార్క్ సెన్సిబుల్ స్టోరీలకు భిన్నంగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. తొలిసారి కమ్ములా ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్ ని తీసుకుని రాసుకున్న స్టోరీ ఇది. ఆయన ఎలాంటి కథ తీసుకున్న రొటీన్ కి భిన్నంగా ఉంటుం ది అన్నది తెలిసిన వాస్తవం. దీంతో ధనుష్ ని ఎలా ఆవిష్కరించబోతున్నాడు? అన్న ఉత్కంఠ అభిమా నుల్లో కనిపిస్తోంది.
తాజాగా ఈ సినిమా గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు లీక్ అవుతున్నాయి. ఈ సినిమా ప్రధానంగా షూటింగ్ అంతా ముంబైలోనే ప్లాన్ చేస్తున్నారుట. మాఫియా స్టోరీ కావడంతో అక్కడ వాస్తవ లొకేషన్లతో పాటు..అవసరం మేర అక్కడే ప్రత్యేకంగా సెట్లు నిర్మించి మేజర్ పార్టు షూటింగ్ పూర్తి చేయాలని భావిస్తు న్నారుట. దీనికి సంబంధించిన పనులు ముంబైలో చకచకా జరుగుతున్నట్లు సమాచారం. వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టనున్నట్లు తెలిసింది.
ఇక ఇందులో పాత్ర కోసం ధనుష్ లుక్ పరంగా పెద్దగా మార్పులేమి చేయలేదుట. మాఫియా స్టోరీ అయినా ధనుష్ ని చాలా కామన్ గా మ్యాన్ గానే చూపించనున్నారని..లుక్ ఛేంజ్ అవసరం లేదని కమ్ములా భావిం చడంతో ప్రత్యేకంగా సన్నద్దం అవ్వడం లాంటివి లేనవి తెలుస్తోంది. ప్రస్తుతం ధనుష్ `కెప్టెన్ మిల్లర్` నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఆ సినిమా కోసం ధనుష్ లుక్ పరంగా చాలా మార్పులు తీసుకొచ్చాడు.
గుబురు గెడ్డం..హెయిర్ స్టైల్... బాడీలో ట్రాన్సపర్మేషన్ ఇలా ధనుష్ లో చాలా మార్పులు కనిపిస్తు న్నాయి. ఈ నేపథ్యంలోశేఖర్ కమ్ములా సినిమా కోసం ధనుష్ ప్రత్యేకంగా సన్నదం అవ్వాల్సిన అవసరం కూడా లేదనిపిస్తోంది. మాఫియా స్టోరీ కాబట్టి ధనుష్ తాజా పిజిక్ తో పర్పెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేయగల్గితే చాలు అనుకున్నారో? ఏమో! అందుకే కమ్ములా సినిమాకి నో వర్కౌట్స్ అన్నట్లు కనిపిస్తుంది.