Begin typing your search above and press return to search.

మిస్టర్ బచ్చన్.. మరో బిగ్ టాస్క్ కంప్లీట్!

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్, ఫస్ట్ సింగిల్ సాలిడ్ రెస్పాన్స్ అందుకున్నాయి.

By:  Tupaki Desk   |   20 July 2024 2:31 PM GMT
మిస్టర్ బచ్చన్.. మరో బిగ్ టాస్క్ కంప్లీట్!
X

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం మిస్టర్ బచ్చన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మరాఠీ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. హరీష్, రవితేజ కాంబోలో మూడో చిత్రంగా రానున్న మిస్టర్ బచ్చన్ పై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్, ఫస్ట్ సింగిల్ సాలిడ్ రెస్పాన్స్ అందుకున్నాయి.

బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ హిట్ మూవీ రైడ్ కు రీమేక్ గా మిస్టర్ బచ్చన్ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మూవీలో రవితేజ.. కథానుగుణంగా అమితాబ్‌ బచ్చన్‌ అభిమానిగా కనిపిస్తాడని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. భాగ్య శ్రీ బోర్సే తన డబ్బింగ్‌ పూర్తి చేసినట్లు ఇటీవల మేకర్స్ తెలిపారు.

అయితే సినిమాలో టాలీవుడ్ స్టార్ యాక్టర్ జగపతి బాబు.. కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఆయన కూడా డబ్బింగ్ పార్ట్ ను పూర్తి చేసినట్లు మిస్టర్ బచ్చన్ మేకర్స్ అనౌన్స్ చేశారు. దాంతో పాటు వీడియో కూడా రిలీజ్ చేశారు. అందులో జగపతి బాబు, హరీష్ శంకర్ ఉన్నారు. ఏదో వీడియో చూపిస్తూ.. 'ఇప్పుడు ఆయన బచ్చన్ అంటున్నావ్.. ఆయన బచ్చన్ అయితే గబ్బర్ సింగ్ విలన్.. మరి గబ్బర్ సింగ్ నేనా నువ్వా' అని జగపతి బాబు.. హరీష్ ను ప్రశ్నించారు.

'సర్ నేను డైరెక్టర్ సర్.. మీరే సర్ గబ్బర్ సింగ్ ఈ సినిమాకు'.. అని చెప్తారు హరీష్ శంకర్. అలా ఇద్దరూ కూడా కాసేపు నవ్వుకున్నారు. ఆ తర్వాత డబ్బింగ్ పూర్తి చేసినందుకు జగ్గూ భాయ్ కు హరీష్ శంకర్ థ్యాంక్స్ తెలిపారు. ఇక.. మరో అప్డేట్ కూడా ఇచ్చారు మేకర్స్. 'మాస్ మహారాజ్ అభిమానులారా.. రేపటి నుండి అప్డేట్స్, అనౌన్స్మెంట్స్ సునామీ కోసం సిద్ధంగా ఉండండి' అని ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ నింపారు.

త్వరలోనే మిస్టర్ బచ్చన్ మూవీ విడుదల తేదీపై క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్. ఆగస్టు 15వ తేదీన సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు టాక్ వినిపిస్తోంది. కానీ ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌ పై టీజీ విశ్వప్రసాద్‌ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. సహనిర్మాతగా వివేక్‌ కూచిభొట్ల వ్యవహరిస్తున్నారు. మిక్కీ జే మేయర్‌ సంగీతం అందిస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందో వేచి చూడాలి.