Begin typing your search above and press return to search.

కోత‌లు..మోత‌లు వెనుక జైల‌ర్ రియాల్టీ!

మ‌రోవైపు అనిరుద్ బీజీఎమ్ తో పిచ్చెక్కించ‌డం ఖాయం. ఇలా జైల‌ర్ -2పై ఎవ‌రి అంచనాలు వారివి. తాజాగా టైటిల్ టీజ‌ర్ మేకింగ్ వీడియోను రిలీజ్ చేసారు.

By:  Tupaki Desk   |   17 Jan 2025 9:59 AM GMT
కోత‌లు..మోత‌లు వెనుక జైల‌ర్ రియాల్టీ!
X

`జైల‌ర్ -2` అనౌన్స్ మెంట్ టీజ‌ర్ ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో సంచ‌ల‌నమ‌వుతుంది. జైల‌ర్ ని మించి `జైల‌ర్ -2` ఉండ‌బోతుంద‌ని ప్రీ టీజ‌ర్ తోనే అర్ద‌మైంది. టైటిల్ టీజ‌ర్ నే ఇలా వ‌దిలారంటే అస‌లైన టీజ‌ర్, ట్రైల‌ర్ ఎలా ఉంటాయి? అన్న‌ది ఊహ‌కి కూడా అంద‌డం లేదు. మ‌రోవైపు అనిరుద్ బీజీఎమ్ తో పిచ్చెక్కించ‌డం ఖాయం. ఇలా జైల‌ర్ -2పై ఎవ‌రి అంచనాలు వారివి. తాజాగా టైటిల్ టీజ‌ర్ మేకింగ్ వీడియోను రిలీజ్ చేసారు.

ఇందులోనూ కోత‌లు..మోత‌ల వెనుక క‌ష్టం క‌నిపిస్తుంది. ర‌జ‌నీకాంత్, నెల్స‌న్, అనిరుద్ స‌హా ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు బ్యాకెండ్లో ఎంత‌గా శ్ర‌మించారు? అన్న‌ది అర్థం ప‌డుతుంది. యాక్ష‌న్ సీక్వెన్స్ ని హైలైట్ చేయ‌డంతో? మేకింగ్ లో వాళ్ల క‌ష్ట‌మంతా క‌నిపిస్తుంది. టైటిల్ టీజ‌ర్ కోస‌మే ఇంత‌గా శ్ర‌మించారంటే షూట్ పూర్తి స్తాయిలో మొద‌లైతే? ర‌జ‌నీకాంత్ మ‌ళ్లీ ష‌ర్ట్ విప్పాల్సిందే.

ఇందులో ర‌జ‌నీకాంత్ కాస్త వ‌య‌సు మ‌ళ్లిన పాత్ర పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న స్వాగ్ ని బేస్ చేసుకుని నెల్సన్ తెర‌కెక్కిస్తోన్న చిత్ర‌మిది. ర‌జ‌నీకాంత్ స్టైల్..ఇమేజ్ కి మ‌రింత మంది స్టార్ క్యాస్టింగ్ ని యాడ్ చేసి సినిమా రేంజ్ ని పెంచుతున్నాడు. `జైల‌ర్ -2`లోనూ స్టార్ హీరోలు చాలామంది భాగ‌మ‌వతార‌ని ఇప్ప‌టికే ప్ర‌చారంలో ఉంది. ఈసారి తెలుగు స‌హా హిందీ మార్కెట్ని దృష్టిలో పెట్టుకుని అక్క‌డ న‌టీన‌టుల‌కు ఎక్కువ స్కోప్ ఇచ్చే అవ‌కాశం ఉంది.

ఇప్ప‌టికే తెలుగు నుంచి మెగాస్టార్ చిరంజీవి, న‌ట‌సింహ బాల‌కృష్ణ లాంటి అగ్ర హీరోల‌పేర్లు వినిపిస్తున్నాయి. ర‌జ‌నీకాంత్ ఇమేజ్ అండ్ స్టైల్ కి బాల‌య్య అయితే ప‌ర్పెక్ట్ గా సెట్ అవుతుంద‌ని చాలా మంది భావిస్తున్నారు. చిరంజీవి కంటే బాల‌య్య లో యాక్ష‌న్ కి ఎక్కువ మంది అభిమానులున్నారు. అది ర‌జ‌నీకాంత్ కి బాగా క‌లిసొచ్చే అంశం. మ‌రి నెల్స‌న్ ఎవ‌ర్ని బ‌రిలోకి దించుతాడో చూడాలి.